ఫ్యాన్ రెక్కలు విరిచేందుకు ప్రజలు సంసిద్ధం
కడప పార్లమెంట్ తెలుగుయువత ప్రధాన కార్యదర్శి అక్కులుగారి విజయ్ కుమార్ రెడ్డి
పులివెందుల
వచ్చే ఎన్నికల్లో ఫ్యాను రెక్కలు విరిచెయ్యడానికి జనం కసితో సంసిద్ధంగా ఉన్నారని తెలుగు యువ త ప్రధాన కార్యదర్శి అక్కుల గారి విజయకుమార్ రెడ్డి, లింగాల మండల కన్వీనర్ విశ్వనాథరెడ్డి లు అన్నారు. సోమవారం టిడిపి కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ వైకాపా సర్కార్ పనితీరుపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఎవరిది అభివృద్ది పాలనో ఎవరిది విధ్వంస పాలనో ప్రజలకు తెలుసన్నారు. బూటక పు ప్రసంగాలు కాదు దమ్ముంటే వైసీపీ నాయకులు బహిరంగ చర్చకు రావాలి? అంటూ సవాలు విసి రారు.స్వర్ణయుగమోఎవరి పాలన రాతి యుగమో తేల్చేద్దాం అంటూ సవాలు విసిరారు.రాష్ట్ర అభి వృద్ధిపై చర్చించేదుకు వైసీపీ నాయకులకు దమ్ముందా? అంటూ సవాల్ విసిరారు. రాష్ట్ర అభివృద్ధి పై చర్చకు మేము కూడా సంసిద్ధంగా ఉన్నామని సవాల్ విసిరారు. 2019లో ప్రజలు ఇచ్చిన ఒక్క ఛాన్స్ జగన్ కు రాజకీయంగా చివరి చాన్స్ అన్నారు. ఓటమి భయంతో బదిలీలు అంటూ 77 మందిని జగన్ మడతపెట్టాడని, మిగిలిన వాళ్లను 50 రోజుల్లో ఇక జనం మడత పెడతారని రూ.10 ఇచ్చి రూ.100 దోచిన జగన్ సంక్షేమ గురించి చెప్పడమా? అంటూ వైకాపా ప్రభుత్వాన్ని హేళన చేశారు.వందల కోట్లు ఖర్చు చేస్తూఅధికార దుర్వినియోగంతో సిద్ధం అని సభలు పెడుతున్నారని,జగన్ నోటి నుంచి వచ్చేవి అన్నీ అసత్యాలు, బూటకపు ప్రసంగాలు, తప్పుడు ప్రచారాలని ఆయనను తప్పు పట్టారు.రాయల సీమలోని 52 నియోజకవర్గాల్లో ప్రయాణికులను ఇబ్బంది పెట్టి ఆర్.టి.సి, స్కూల్ బస్సుల్ని లాక్కొని జనాన్ని బలవంతంగా రాప్తాడు సభకు తరలించా రని వారన్నారు.ఇరిగేషన్ ప్రాజెక్టులను రివర్స్ చేసి, రైతుల సబ్సిడీల నిలిపివేసిన జగన్ కు అసలు రాయలసీమలో సభ పెట్టే అర్హతే లేదని వారన్నారు. ఈ కార్యక్రమంలో లింగాల రైతు విభాగ అధ్యక్షులు రాఘవ రెడ్డి, సీనియర్ నాయకులు గురివిరెడ్డి, యువ నాయకులు ప్రదీప్ రెడ్డి లుపాల్గొన్నారు.