టిడిపి కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించిన బీటెక్ రవి
పులివెందుల
అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందిం చడమే ముఖ్యమంత్రిచంద్రబాబు నాయుడు లక్ష్య మని మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి అన్నారు. గురువా రం పులివెందుల పట్టణంలోని టిడిపి కార్యాలయం లో ఆయన ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిం చారు.ఈ సందర్భంగాపులివెందుల నియోజకవర్గం లోని చుట్టూ పక్కల గ్రామాల నుంచి వచ్చిన ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు అందించిన వినతి పత్రాలను స్వీకరించి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి కూటమి ప్రభుత్వంలో న్యాయం జరుగు తుందన్నారు. అనంతరం అక్కడికి వచ్చిన ప్రజలు పెన్షన్లు ,రేషన్ కార్డుల మంజూరు కోసం, విద్య, వైద్య, ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ప్రజలు అర్జీలు ఇవ్వడం, వారి అర్జీలను పరిశీలించివారి సమస్యలను అధిష్టాన దృష్టికి తీసుకువెళ్లి ఆయా సమస్యలను పరిష్కరింప చేస్తామన్నారు.

