Sunday, September 14, 2025

Creating liberating content

తాజా వార్తలునేడు పుచ్చలపల్లి సుందరయ్య 38.వ వర్ధంతి

నేడు పుచ్చలపల్లి సుందరయ్య 38.వ వర్ధంతి

నమ్మిన సిద్ధాంతం కోసం తన శేష జీవితాన్ని ఆదర్శవంతంగా గడిపిన మహామనిషి
: విశ్వం ఉన్నంతవరకు ప్రజల వృదయాల్లో అతడు మహనీయుడే

ప్రజాభూమి
నమ్మిన సిద్ధాంతం కోసం, పేద,బడుగు,బలహీన వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం నిరంతరం తపించి, తన శేషజీవితాన్ని సామాన్య ప్రజల మధ్యన గడిపి మహామనిషిగా అన్ని వర్గాల ప్రజలచేత కీర్తించబడుతున్న మహనీయుడు భారత కమ్యూనిష్టు పార్టీ (మార్క్సిస్టు) సిపిఎం వ్యవస్థాపకులు,ఆదర్శ పార్లమెంట్ సభ్యులు అమరజీవి కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య. సుందరయ్య అసలు పేరు సుందరరామిరెడ్డి. సుందరరామిరెడ్డి నెల్లూరు జిల్లా, అప్పటి కొవ్వూరు తాలూక,అలగానిపాడు గ్రామంలో శేషమ్మ,వెంకటరామిరెడ్డి భూస్వామి దంపతుల కుటుంబంలో జన్మించారు. సుందరరామిరెడ్డి బాల్యం నుండే క్రమశిక్షణ, నిజాయితీ, నిడాంబ్రత, అన్యాయాన్ని ఎదిరించే గొప్ప స్వభావి.
జైలు జీవితంతో కమ్యూనిస్టుగా మారి……….
సుందరరామిరెడ్డి తొలూత గాంధీగారి సిద్ధాంతాలకు ఆకర్షితులై పలు ఉద్యమాల్లో పాల్గొని తన 18.వ ఏట జైలుకు వెళ్లారు. జైల్లో సహచర కమ్యూనిస్టులతో ఏర్పడిన పరిచయాలతో కమ్యూనిష్టు పార్టీకి ఆకర్షితులై కమ్యూనిస్టుగా మారారు. తర్వాత తన పేరు చివరన ఉన్న కుల చిహ్నాన్ని తొలగించుకొని, సుందరయ్య గా పేరు మార్చుకున్నారు. అందరివాడిగా ఉండేందుకు తాను పెట్టుకున్న సుందరయ్య పేరే ఖండాలను దాటి అందరి గుండెల్లో చెరగని ముద్రవేసుకొని,నేడు ప్రపంచ వ్యాప్తంగా తన అభిమానుల చేత నీరాజనాలు అందుకుంటుంది.
హక్కుల కోసం పోరాడి ఆచరణలో పెట్టి……….
1930 దశకంలో దళితుల పై అనేక ఆంక్షలు ఉండేవి. పుచ్చలపల్లి సుందరయ్య బడుగు, బలహీన, దళితుల హక్కుకై పోరాడి వాటిని ఆచరణలో పెట్టిన మహనీయుడు. కమ్యూనిష్టు పార్టీలో అంచెలంచెలుగా ఎదిగి కేంద్రకమిటీ సభ్యులయ్యారు. 1949 లో అప్పటి కేంద్ర ప్రభుత్వం కమ్యూనిష్టు పార్టీ పై నిషేదం విధించింది. దీంతో సుందరయ్య 1941 వరకు అజ్ఞాత జీవితం గడిపారు.1943 లో తాను ప్రేమించిన లీలను పార్టీ నిబంధనల మేరకు జీవిత భాగస్వామిగా వివాహం చేసుకున్నారు. పిల్లలు పుడితే తనలో స్వార్థం పెరుగుతుందని భావించి,కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేపించుకున్నారు. తండ్రి నుండి తనకు సంక్రమించిన 90.ఎకరాల పై చిలుకు భూమిని దళితులకు పంచిపెట్టి, నికాసైన కమ్యూనిస్టుగా నిలిచారు. వివాహం తరువాత పార్టీ పై పెరిగిన ఆంక్షల కారణంగా సుందరయ్య రెండవ సారి 1948 నుండి 1952 వరకు అజ్ఞాత జీవితం గడిపారు.
ఆదర్శ ప్రజా ప్రతినిధిగా సుందరయ్య జీవిత ప్రస్థానం సాగిందిలా……….
1952 లో సుందరయ్య మద్రాసు నియోజక వర్గం నుండి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 1952- 1955 మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడిగా పనిచేశారు. 1964 లో కమ్యూనిష్టు పార్టీ రెండుగా చీలిపోయింది. దీంతో సుందరయ్య మరికొందరు అగ్రానాయకులతో కలిసి సిపిఎం (భారత కమ్యూనిష్టు పార్టీ మార్క్సిస్టు ) ను స్థాపించారు. ఆతరువాత పార్టీని దేశ నలుమూలలకు విస్తరింపజేశారు.
1978 నుండి 1983 వరకు సిపిఎం శాసనసభ పక్ష నాయకుడిగా……………
సుందరయ్య 1978 నుండి 1983 వరకు సిపిఎం శాసనసభ పక్ష నాయకుడిగా పనిచేశారు. ఆ తరువాత పార్లమెంట్ కు వెళ్లారు. పార్లమెంట్ లో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు సైతం, హంగు, ఆర్భాటాలకు తావులేకుండా పార్లమెంట్ కు సైతం ఆయన తన సైకిల్ పై వెళ్తు ఎందరో ప్రజా ప్రతినిధులకు ఆయన ఆదర్శప్రాయుడయ్యారు.
తుదిశ్వాస విడిచేవరకు అదే నిజాయితీ, నడాంబ్రత…………..
సుందరయ్య 1985 మే 19.వ తేదీన సరిగ్గా ఇదే రోజు ఈ లోకాన్ని వీడి అమరుడయ్యారు. తుదిశ్వాస విడిచేవరకు అదే నిజాయితీ, నడాంబ్రతతో ఆయన జీవన ప్రస్థానం కొనసాగింది. నేడు మహనీయుడు పుచ్చలపల్లి సుందరయ్య 38.వ వర్ధంతిని పురస్కరించుకొని,వారి నిజాయితీ, నిడాంబ్రత, వారిలోని త్యాగశీలతను మరొక్కసారి నెమరువేసుకుందాం! వారి గొప్పతనాన్ని భావితరాలకు చాటి చెప్పుదాం!! నేటి తరం నేతలు అమరజీవి పుచ్చలపల్లి సుందరయ్యను స్ఫూర్తిగా తీసుకొని ప్రజాసేవ చేయాలని కోరుకుందాం !!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article