బిజెపి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించడమే లక్ష్యం ప్రజా పోరుబాట కో కన్వీనర్ చలపతి
లేపాక్షి: మండల కేంద్రమైన లేపాక్షిలో గురువారం జిల్లా ప్రజా పోరుబాట కో కన్వీనర్ చలపతి ఆధ్వర్యంలో ప్రారంభ మైంది. ఈ సందర్భంగా లేపాక్షి వీరభద్రాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి పోరుబాట కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రజా పోరు బాటలో భాగంగా లేపాక్షి బస్టాండ్ లో జరిగిన కార్యక్రమంలో బిజెపి నాయకులు మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు, రైతులకు ,కార్మికులకు, కర్షకులకు పలు సంక్షేమ పథకాలు అమలు చేయడం జరుగుతోందన్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం తమ స్టిక్కర్లు అంటించి తామే పథకాలను అమలు చేస్తున్నట్లు ప్రచారం చేయడం విడ్డూరంగా ఉందన్నారు. సంక్షేమ పథకాలు అమలులో సింహ భాగం కేంద్ర ప్రభుత్వమే భరిస్తోందన్నారు. అనంతరం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఇంటింటా ప్రచారం నిర్వహించారు. అనంతరం కంచి సముద్రం గ్రామంలో ప్రజా పోరు బాట కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రజా పోరు బాట అసెంబ్లీ కన్వీనర్ ఆదర్శ్ కుమార్ , జిల్లా సమ్యోజాక్ రమణ మూర్తి , జిల్లా ఉపాధ్యక్షులు వరప్రసాద్ ,మహిళ మోర్చ రాష్ట్ర ఉపాధ్యక్షులు భాగ్యలక్ష్మి , లేపాక్షి మండల అధ్యక్షులు నరసింహ మూర్తి, హిందూపురం నగర కన్వీనర్ శంకర్ , లేపాక్షి ప్రజా పోరు కన్వీనర్ బద్రి , కో కన్వీనర్ వెంకట శివప్ప , శివ దత్త రెడ్డి , నీరుగంటి ఆంజనేయులు , నాగరాజు, లక్ష్మీనారాయణ , మోర్చా గోవింద్, వేణుగోపాల్ , లేపాక్షి మండల యువమార్చ అధ్యక్షులు రాజు కార్యకర్తలు పాల్గొన్నారు.