ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కృష్ణమ్మ ఎగువ ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున వచ్చిన వరదల్లో బ్యారేజీ వద్దకు కొట్టుకువచ్చిన పడవుల తొలగింపు కార్యక్రమాన్ని అధికారులు ముమ్మరం చేశారు. కృష్ణమ్మ నదికి ఎగువ ప్రాంతాల నుండి భారీగా వచ్చిన వరదల కారణంగా బ్యారేజీ వద్ద అనేక సమస్యలు తలెత్తాయి. ఐదు పడవలు భారీ వరద నీటిలో కొట్టుకువచ్చి, బ్యారేజీ గేట్లను బలంగా ఢీకొట్టడంతో గేట్లు దెబ్బతిన్నాయి. ముఖ్యంగా 67, 69, 70 గేట్లు పెద్దగా నష్టపోయాయి. ఈ ఘటనలో కౌంటర్ వైట్లు దెబ్బతిన్నాయి, వాటిని పునరుద్ధరించడం అధికారులు చేపట్టారు.వరద నీటి ప్రవాహం 11 లక్షల క్యూసెక్కులకు చేరుకోవడంతో పని చేయడం కష్టంగా మారింది. కానీ, ప్రవాహం తగ్గిన తర్వాత కౌంటర్ వైట్లను సరిచేయడంలో అధికారులు సఫలమయ్యారు. ఒక ప్రైవేట్ సంస్థ సహాయంతో, భారీ క్రేన్లను ఉపయోగించి, పడవలను నీటి ప్రవాహం నుండి తొలగించే చర్యలు తీసుకున్నారు.
