పోరుమామిళ్ల :గొడవలను ప్రోత్సహిస్తే వారు ఎంతటి వారైనా చర్యలు తప్పవని సిఐ చిరంజీవి పేర్కొన్నారు శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పోరుమామిళ్ల సర్కిల్ పరిధిలోని పోరుమామిళ్ల, కలసపాడు, కాసినాయన పోలీస్ స్టేషన్ల పరిధిలోని ప్రజలకు మరియు వివిధ రాజకీయ పార్టీల వారికి తెలియపరచడం ఏమనగా
ఎన్నికల తర్వాత మన రాష్ట్రంలో జరుగుతున్న పోస్ట్ పోల్ సంఘటనలు దృష్టిలో పెట్టుకొని ఎవరైనా సరే, ఎంతటి వారైనా సరే గొడవలను ప్రోత్సహించిన, గొడవల్లో పాల్గోన్న వారిపై అటెంమెంట్ మర్డర్ లాంటి నాన్ బెయిలబుల్ కేస్ లు రిజిస్టర్ చేసి వెంటనే రిమాండ్ కి తరలించి జైల్ కి పంపడం జరుగుతుందిన్నారు. అదేవిధంగా రౌడీ షీట్స్ కూడా ఓపెన్ చేసి, మండల మరియు జిల్లా బహిష్కరణ చేయడం జరుగుతుందన్నారు.
కాబట్టి పోరుమామిళ్ల సర్కిల్ లోని పోరుమామిళ్ల, కలసపాడు, కాసినాయన పోలీస్ స్టేషన్ల పరిధిలోని ప్రజలు, రాజకీయ నాయకులు దయచేసి ఎవరూ కూడా గొడవలు పెట్టుకోవద్దు అని ఏదైనా సమస్యలు వుంటే పోలీస్ స్టేషన్ లలో సంప్రదించమని పోలీస్ శాఖ తరుపున విజ్ఞప్తి చేశారు. వివరాలకు చిరంజీవి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ పోరుమామిళ్ల సర్కిల్ల్ 9121100630 నంబర్ కు ఫోన్ చేయగలరన్నారు.