ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నివాసంపై దాడి కేసులో మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేశ్‌కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. మంగళగిరి డీఎస్పీ ఆఫీసులో ఈ రోజు సాయంత్రం విచారణకు హాజరు కావాలని ఆయనకు సూచించారు.ఇప్పటికే, అగ్రిగోల్డ్ భూముల కొనుగోలు వ్యవహారంలో జోగి రమేశ్ కుమారుడు రాజీవ్‌ను ఏసీబీ అధికారులు ఉదయం అరెస్ట్ చేశారు. జోగి రమేశ్‌పై, వైసీపీ హయాంలో ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంపై దాడికి ప్రయత్నం చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి.ఈ పరిణామాలపై జోగి రమేశ్ స్పందిస్తూ, తన కొడుకును అరెస్ట్ చేయడం తప్పేనని, రాజకీయ కక్షలు తీర్చుకోవడానికి తను తగిన వారిని లక్ష్యంగా చేసుకోవాలని, కొడుకుపై ఎందుకు చర్య తీసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు మారవచ్చు, కానీ కక్షసాధింపు చర్యలు సరియైనవి కాదని, చంద్రబాబు ఇలాంటి రాజకీయ కక్షలకు దూరంగా ఉండాలని సూచించారు.

