జగ్గంపేట :కాకినాడ జిల్లా జగ్గంపేట గ్రామంలోని శెట్టిబలిజ కాలనీ శివారు పంట పొలాలలో రహస్యంగా ఆడుతున్న పేకాట శిబిరంపై ఆదివారం జగ్గంపేట ఎస్సై టి.రఘునాథరావు తన సిబ్బందితో దాడులు నిర్వహించారు.
ఈ దాడుల్లో ముగ్గురు పేకాట రాయులను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి ₹ 5వేల 200 రూపాయల నగదును, పేక ముక్కలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై రఘునాధరావు తెలిపారు. వీరిని రేపు ఉదయం కోర్టులో హాజరు పరచడం జరుగుతుందని ఎస్ఐ తెలిపారు. జగ్గంపేట మండల పరిధిలో పేకాట, కోడిపందాలు వంటి జూదాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్ఐ హెచ్చరించారు. ఎక్కడైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు తెలిస్తే పోలీసులకు సమాచారం అందించాలని ఎస్సై కోరారు..

