అనంతపురం టూటౌన్ పోలీసుల ఫ్లాగ్ మార్చ్
- కేంద్రసాయుధ బలగాలచే సమస్యాత్మక కాలనీలలో కొనసాగిన కవాతు అనంతపురము
జిల్లా ఎస్పీ గౌతమిసాలి ఆదేశాల మేరకు అనంతపురం నగరంలోని టూటౌన్ సి.ఐ. క్రాంతికుమార్ పర్యవేక్షణలో కేంద్ర సాయుధ బలగాలు, స్థానిక పోలీసులు ఫ్లాగ్ మార్చ్ చేశారు. సమస్యాత్మక కాలనీలైన స్థానిక నాయక్ నగర్, ఆదర్శనగర్, కృపానందనగర్ లలో కవాతు కొనసాగింది. అనంతరం ఆయా కాలనీల ప్రజలతో మాట్లాడి కౌంటింగ్ ప్రశాంతంగా జరిగేలా అందరూ సహకరించాలని… కౌంటింగ్ తర్వాత కూడా గెలుపోటముల ప్రభావం చూపకుండా అందరూ ప్రశాంతంగా మెలగాలని సూచించారు.