Tuesday, February 17, 2026

Creating liberating content

తాజా వార్తలుస‌జ్జ‌ల‌పై కేసు న‌మోదు

స‌జ్జ‌ల‌పై కేసు న‌మోదు

వైసీపీ నేత స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డిపై తాడేప‌ల్లిలో కేసు న‌మోద‌య్యింది. రెండు రోజుల క్రితం మీడియా సమావేశంలో మాట్లాడుతూ కౌంటింగ్ ఏజెంట్లపై కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో టీడీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, బుధవారం తాడేపల్లిలో వైసీపీ కౌంటింగ్ ఏజెంట్లతో సజ్జల సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో మనం ఏమీ ఇక్కడ కూర్చొని రూల్స్ ఫాలో కావడానికి రాలేదని, సాధ్యమైనంత వరకు వాదన చేసేవాళ్లు కూర్చోవాలన్నారు. కౌంటింగ్ ఏజెంట్స్.. రూల్స్ ఫాలో అయ్యి వెనక్కి తగ్గేవాళ్లు రావద్దని చెప్పారు. టీడీపీ, జనసేన ఏజెంట్లకు ప్రతి విషయంలో అడ్డం తిరగాలని సూచన చేశారు.కాగా, సజ్జల చేసిన ఈ వ్యాఖ్యలు ముమ్మాటికీ ఎన్నికల నియమావళికి ఉల్లంఘించడమేనని టీడీపీ ఆరోపించింది. ఈ క్రమంలో టీడీపీ నేతలు దేవినేని ఉమ, న్యాయవాది గుడపాటి లక్ష్మీనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో 153, 505, 125 మూడు సెక్షన్ల కింద సజ్జలపై పోలీసులు కేసు రిజిస్టర్ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article