తడి పొడి చెత్త నుండి ప్రకృతి ఎరువులు తయారు:పోలవరం శాసనసభ్యులు బాలరాజు

జీలుగుమిల్లి :కూటమి ప్రభుత్వం సంపద సృష్టించి రైతులను వ్యవసాయ కూలీలను ఆదుకుంటుందని పోలవరం శాసనసభలు బాలరాజు అన్నారు.
పి. అంకంపాలెం పంచాయతీ లో ఘనవ్యర్థలా నిర్వహణ, చెత్తనుండి సంపద తయారీ కేంద్రా నిర్వహణ పై డివిజన్ స్థాయి కార్యక్రమనికి ముఖ్య అతిధిగా శాసనసభ్యులు బాలరాజు పాల్గొన్నారు.
తడి -పొడి ఘన వ్యర్థలను సేకరించి ఎరువుగా మార్చే వర్మీ కంపోస్ట్ యార్డలను ఎమ్మెల్యే పరిశీలించారు.
నియోజకవర్గం నుండి 90% కంప్లిట్ అయి ఉన్న కంపోస్ట్ యార్డ్లు ఉన్నందుకు సంతోషం వ్యక్తం చేశారు. కానీ గత ప్రభుత్వం పారిశుద్యం విషయం లో ఎటువంటి చర్యలు తీసుకోలేదు. కానీ కూటమి ప్రభుత్వంలో వాటి ద్వారా 100% పని జరగాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పారిశుధ్య పనులకు పూర్తి మద్దతూ ఇస్తానన్నారు.గవర్నమెంట్ తరుపున గ్రామ శుభ్రత -అభివృద్ధి విషయం లో మన సీఎం నారా చంద్రబాబు నాయుడు , డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ఎప్పుడుమనకు సాకారం అందిస్తాం అని అన్నారు. కావున పారిశుధ్యం సంబందించి ఎటువండి సహాయం కావాలన్నా నన్ను నేరుగా సప్రదించవచు అని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
కరోనా సమయం నుండి వెనుకడుగు వెయ్యకుండా అంకంపాలెం పంచాయతీకి సేవలు అందించిన ముగ్గురు పారిశుధ్య కార్మికులకు ఎమ్మెల్యే చిర్రి బాలరాజు చిరు సన్మానం చేసి, వారికీ మనిషికి 5 వేలు చెప్పున్న మొత్తం 15వేలు రూపాయలు బహుమతిగా ఇస్తామని ప్రకటించారు.
ఈ కార్యక్రమం లో ఏలూరు జిల్లా బీజేపీ కార్యదర్శి చాట్రాయి ప్రసాద్ ,జీలుగుమిల్లి జనసేన మండల ప్రెసిడెంట్ పసుపులేటి రాము , టీడీపీ ప్రెసిడెంట్ సుంకవలి సాయి, బీజేపీ ప్రెసిడెంట్ కొండపల్లి ప్రసాద్ అంకంపాలెం ఎంపీటీసీ నాలి శ్రీను , ఎంపీడీఓ మంగతుయారు, సర్పంచ్ బుద్ధా జగ్గారావు , యం. రాజు , రాజవుళ్ళ, నిఖిల్ , మరియు అన్ని పంచాయతీ లు పంచాయతీ సెక్రటరీలు, సిబ్బంది, కూటమి నాయకులు తదితరులుపాల్గొన్నారు.

