సిసి రోడ్లు బిటి డ్రైనేజీలకు ప్రాధాన్యత !
శాసనసభ్యులు బాలరాజు
జీలుగుమిల్లి :ప్రాధాన్యత క్రమంలో పోలవరం నియోజవర్గంలో సిసి రోడ్లకు బీటీ రోడ్లకు డ్రైనేజీలకు 100 కోట్ల నిధులతో ప్రణాళిక సిద్ధం చేశామని పోలవరం శాసనసభ్యులు ఎస్ బాలరాజు అన్నారు. పి అంకంపాలెం గ్రామంలో ఏర్పాటు చేసిన తడిపొడి కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు నియోజకవర్గంలోని అన్ని రోడ్లు ధ్వంసం అయ్యాయని ఇప్పటికే నడవడానికి ప్రయాణానికి కూడా అణువుగా లేనటువంటి రహదారులను గుర్తించి వాటికి ప్రాధాన్యత ప్రకారం పనులు చేపట్టినట్లు చెప్పారు . రౌతు గూడెం నుండి జొన్న వారి గుడి వరకు 5.34 లక్ష రూపాయలతో పనులకు భూ పూజ చేసినట్లు చెప్పారు .వర్షాకాలం అవగానే వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు కాంట్రాక్టర్లు యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టడం కోసం ఏర్పాట్లు చేశామని ఆయన చెప్పారు. ఇప్పటికే 87 కోట్ల రూపాయలకు ప్రతిపాదన తయారుచేసి జనసేన అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబుకి అందించడం జరిగిందని చెప్పారు . తనను ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి వద్దకు తీసుకుని వెళ్లి ఈ పనులు చేసి పెట్టాలని చెప్పడం జరిగిందని అన్నారు. ఈ పనులకు యుద్ధప్రాతిపదిగిన మంజూరు చేయడం కోసం ఆయన కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఈ ప్రతిపాదనలు రాగానే పనులు చేపట్టడానికి కోసం ఆయా శాఖలను సమయత్వం చేశామని చెప్పారు. నియోజకవర్గంలో కొవ్వూరు నుండి జీలుగుమిల్లి వరకు బైపాస్ రోడ్డు కూడా వస్తుందని అవి కూడా ఇప్పటికే గుర్తించినట్లు చెప్పారు. పొలాలను స్థలాలను స్వాధీనిపరచుకొని పనులు చేపట్టడం కోసం తగు ఏర్పాట్లు చేశామని ఆయన ఈ సందర్భంగా చెప్పారు.

