Monday, February 16, 2026

Creating liberating content

తాజా వార్తలుగులాబీ పువ్వుతో కంగన రనౌత్.. స్టేజ్ మీద క్వీన్‌కు షాకిచ్చిన ప్రధాని మోదీ!

గులాబీ పువ్వుతో కంగన రనౌత్.. స్టేజ్ మీద క్వీన్‌కు షాకిచ్చిన ప్రధాని మోదీ!

కంగన రనౌత్ లోక్‌సభ ఎన్నికల్లో తన సొంత రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్‌లోని మండి పార్ల‌మెంట్ స్థానం నుంచి బరిలోకి నిలిచారు. దీంతో ప్ర‌స్తుతం ఆమె ఎన్నిక‌ల ప్ర‌చారంలో దూసుకెళ్తున్నారు. ఈ క్ర‌మంలో కంగనకు ప్రధాని న‌రేంద్ర‌ మోదీ చిన్న ఝలక్ ఇచ్చారు. బీజేపీ ప్రచారంలో భాగంగా మండి నియోజకవర్గంలో తాజాగా ప్రధాని మోదీ పర్యటించారు. మండిలో ఏర్పాటు చేసిన సభలో కంగన రనౌత్ తరఫున ప్రసంగించారు. అంతకుముందు ప్రధానిని ఆహ్వానిస్తూ.. ఒక గులాబీ పువ్వును ఇచ్చేందుకు ఆమె ప్రయత్నించారు. తన అనుచరులు తీసుకొచ్చిన గులాబీని కంగన అందించడానికి ప్రయత్నించ‌గా.. సున్నితంగా తిర్కరిస్తూ మోదీ చేతులెత్తి దండం పెట్టారు. ప్రస్తుతం ఆ వీడియో సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతోంది. దీనిపై నెటిజ‌న్లు త‌మ‌దైన శైలిలో స్పందిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article