బిజెపి మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు బి.నిర్మల కిషోర్
బుట్టాయగూడెం:ప్రధానమంత్రి విశ్వకర్మ కౌశల్ యోజన కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని దేశంలో ప్రతి మహిళ ఆర్థికంగా స్వయంసమృద్ధి సాధించాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు బొల్లిన నిర్మల కిషోర్ అన్నారు. మండలంలోని బుట్టాయిగూడెం లో బుధవారం నారీ శక్తి వందన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. పశ్చిమ బెంగాల్లో ప్రధానమంత్రి మోడీ నారీ శక్తివంధన్ ముగింపు కార్యక్రమంలో దేశంలో ఉన్న మహిళలందరిని ఉద్దేశించి ప్రసంగించిన ప్రసంగాన్ని ఎల్ఈడి స్క్రీన్ ద్వారా బుట్టాయగూడెం పరిసర ప్రాంత మహిళలకు డిజిటల్ స్క్రీన్ ద్వారా ప్రదర్శించారు. విశ్వకర్మ యోజన కార్యక్రమంలో అందరూ రిజిస్ట్రేషన్ చేయించుకుని, వారి యొక్క సొంత కాళ్ళ మీద నిలబడే విధంగా ఏర్పాటు చేసినటువంటి పీఎం విశ్వకర్మ కౌశల్ యోజన కార్యక్రమాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ప్రధానమంత్రి మోడీ ప్రసంగంలో కోరారు. అలాగే దేశంలో మహిళలకి పూర్తి సంరక్షణ చేకూర్చాలని, లక్ పతి దీదీ అనే కార్యక్రమం ద్వారా ఇప్పటికే దేశంలో కోటి మంది మహిళలను లక్షాధికారులను చేయడం జరిగిందని గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వర్చువల్ ప్రసంగంలో వివరించారు. ఈ కార్యక్రమంలో బిజెపి మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు బొల్లిన నిర్మల కిషోర్, గిరిజన మోర్చా జిల్లా అధ్యక్షురాలు వంక కాంచనమాల, మహిళా మోర్చా జిల్లా పదాధికారులు కె.మల్లేశ్వరి, పడాల అరుణ, గిరిజన మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మొడియం శ్రీనివాసరావు, బుట్టాయగూడెం మండల అధ్యక్షుడు దొమ్మేటి లక్ష్మీ జనార్దనరావు, ప్రధాన కార్యదర్శి సోమ హరి నారాయణ, జంగారెడ్డిగూడెం పట్టణ అధ్యక్షుడు కొప్పాక శ్రీనివాసరావు, పోలవరం నియోజకవర్గం కన్వీనర్ కొండేపాటి రామకృష్ణ బుట్టాయిగూడెం మహిళా మోర్చా అధ్యక్షురాలు పసుపులేటి అంజని, సోర్న పుణ్యలక్ష్మి పాల్గొన్నారు సుమారుగా 200 మంది మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రధానమంత్రి ఉపన్యాసాన్ని ఆలకించారు.