Friday, May 9, 2025

Creating liberating content

టాప్ న్యూస్పవన్ కళ్యాణ్ ఒక తుఫాన్

పవన్ కళ్యాణ్ ఒక తుఫాన్

జనసేనానికి మోదీ కితాబు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు సార్వత్రిక ఎన్నికలలో తమకు పెద్ద ఎత్తున మద్దతు ఇచ్చారని ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు. ఢిల్లీలోని పాత పార్లమెంట్ భవనం సెంట్రల్ హాల్లో శుక్రవారం ఎన్డీయే ఎంపీల సమావేశం నిర్వహించి మోదీ నాయకత్వానికి ఆమోదముద్ర వేశారు.ఎన్డీఏ ఎంపీల భేటీలో 270 మంది బీజేపీ ఎంపీలతో పాటు టిడిపి, జెడియు, శివసేన, లోక్ జనశక్తి, ఎన్సీపీ, జెడిఎస్, జనసేన, అప్నా దళ్ సహా ఇతర మిత్రపక్షాల ఎంపీలు, ఎన్డీఏ పక్షాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు హాజరయ్యారు.ఎన్డీఏ పక్ష నేతగా నరేంద్ర మోదీ నాయకత్వాన్ని వారంతా సమర్థిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేశారు.
ఈ కార్యక్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోదీ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇవి నాకు భావోద్వేగ క్షణాలు అని పేర్కొన్న మోదీ తెలుగు రాష్ట్రాలలో ప్రజలు ఎన్డీయే ను ఆదరించారని సంతోషం వ్యక్తం చేశారు. ఏపీలో ప్రజలు తనకు పెద్ద బహుమతి ఇచ్చారని మోదీ వ్యాఖ్యలు చేశారు. ఏపీలో భారీ విజయం ప్రజల ఆకాంక్షలకు అద్దం గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణాలో కాంగ్రెస్ కు అధికారం ఇచ్చినా ఇప్పుడు లోక్ సభలో ప్రజలు తమను ఆదరించారన్నారు. పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి మాట్లాడిన మోదీ ఇక్కడ కూర్చున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ కాదు తుఫాన్ అంటూ పేర్కొన్నారు . ఏపీలో ఇంత భారీ విజయం ప్రజల ఆకాంక్షలకు అద్దం పట్టిందని మోదీ కొనియాడారు.మన సమక్షంలో పవన్ కళ్యాణ్ ఉన్నారని ఆయన తుఫాన్ .. సునామి లాంటి వాడని చంద్రబాబు ముందే మోదీ పవన్ కళ్యాణ్ కు కితాబిచ్చారు. ఇక పవన్ కళ్యాణ్ పై ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలకు పవన్ కళ్యాణ్ నవ్వుతూ మోదీకి కృతజ్ఞతా పూర్వకంగా అభివాదం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article