Wednesday, February 18, 2026

Creating liberating content

తాజా వార్తలుజమ్మూ ఉగ్రదాడి వెనక పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ లష్కరే తయ్యిబా

జమ్మూ ఉగ్రదాడి వెనక పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ లష్కరే తయ్యిబా

జమ్మూలోని రియాసిలో ఆదివారం జరిగిన ఉగ్రదాడి వెనక పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ లష్కరే తయ్యిబా (ఎల్ఈటీ) తేలింది. వైష్ణోదేవి ఆలయ సందర్శనకు వెళ్తున్న యాత్రికుల బస్సుపై ఉగ్రవాదులు అకస్మాత్తుగా కాల్పులకు తెగబడ్డారు. ఈ క్రమంలో బస్సు లోయలో పడడంతో 9 మంది మరణించగా, మరో 33 మంది తీవ్రంగా గాయపడ్డారు.ఈ ఘటనకు పాల్పడింది తామేనని లష్కరే తయ్యిబాకు చెందిన టీఆర్ఎఫ్ ప్రకటించింది. ప్రధానిగా నరేంద్రమోదీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో ఈ ఘటన జరగడం గమనార్హం. దాదాపు డజను మంది ఉగ్రవాదులు రెండుమూడు గ్రూపులుగా విడిపోయి రాజౌరి-పూంచ్ అటవీ ప్రాంతంలోకి చొరబడ్డారు. వీరిలో పాకిస్థాన్ జాతీయులు కూడా ఉన్నారు. వారే ఈ ఘాతుకానికి పాల్పడినట్టు తెలుస్తోంది. పూంచ్-రాజౌరి సెక్టార్‌లో గత ఐదేళ్లుగా భద్రతా దళాలు-సైన్యం మధ్య తరచూ కాల్పులు జరుగుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article