న్యూఢిల్లీ : ఆప్‌ను అంతం చేయాలన్న ఉద్దేశంతో ఆప్ నేతలను అరెస్టు చేసి జైళ్లకు పంపించేందుకు బిజెపి ఆపరేష్ ఝాడు కార్యక్రమాన్ని చేపట్టిందని బిజెపి, ప్రధానమంత్రి నరేంద్ర మోడిలపై ఆమ్‌ఆద్మీపార్టీ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బిభవ్ కుమార్ అరెస్టుకు నిరసనగా … బిజెపి ప్రధాన కార్యాలయాన్ని ముట్టడించేందుకు పార్టీ కార్యకర్తలతో ఆదివారం కేజ్రీవాల్ బయలుదేరారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ మాట్లాడుతూ …. ఆమ్‌ఆద్మీ పార్టీని మట్టికరిపించాలని ప్రధాని నిర్ణయించుకున్నారని విమర్శించారు. ఆప్ గురించి విమర్శలు చేస్తూనే ఉన్నారని.. ఆప్‌ను అంతం చేయాలని భావిస్తోన్న బిజెపి.. తనకు బెయిల్ వచ్చినప్పటి నుంచి ఆపరేషన్ ఝాడు పేరుతో కార్యక్రమాన్ని మొదలుపెట్టిందని అన్నారు. ఆప్ నేతల అరెస్టులు, పార్టీ బ్యాంకు అకౌంట్లను సీజ్ చేయడం, ఆప్ కార్యాలయాలను మూసివేయించడం వంటివి అందులో భాగమేనని కేజ్రీవాల్ ఆరోపించారు.