ఒంటిమిట్ట:ఆంధ్రుల ఆరాధ్య దైవంగా పిలవబడే శ్రీ ఒంటిమిట్ట కోదండ రామాలయంలో సీతమ్మ తల్లి జయంతి వేడుకలు వైభవంగా జరిగాయి.
సీతాదేవి జయంతి సందర్భంగా రామాలయంలో సీత రామ లక్ష్మణులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఎక్కువ జమున పంచామృతాలతో అభిషేకం మంగళ హారతులు కుంకుమార్చన పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలతో పూలతో,ప్రత్యేక అలంకరణ చేశారు. ఆలయ టిటిడి డిప్యూటీ ఈవో నటేష్ బాబు అమ్మవారికి పట్టు వస్త్రాలు పూలు,పండు, వేద పండితుల మంత్రాచరణ, మంగళ వాయిద్యాల నడుమ సాంప్రదాయబద్ధంగా సమర్పించారు, సీతమ్మ వారి జయంతి వేడుకలను దర్శించేందుకు వివిధ ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యల భక్తులు కుటుంబ సమేతంగా హాజరయ్యారు ఎంతో భక్తితో సీతమ్మవారిని దర్శించుకుని తన్మయత్నం చెందారు ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు వీణ రాఘవాచార్యులు, మనోజ్, టీడీపీ సిబ్బంది పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
