ఒంటిమిట్ట:మండల కేంద్రమైన సిద్ధవటం పశు వైద్యశాలను మంగళవారం వెటర్నరీ డిప్యూటీ డైరెక్టర్ రమణయ్య ఆకస్మిక తనిఖీ చేసి వెటర్నరీ వైద్యశాల సిబ్బంది వివరాలు సేకరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విధి నిర్వహణలో భాగంగా ప్రతి ఉద్యోగి సమయపాలన దిశగా వైద్యశాలకు రావాలని పల్లె ప్రాంతాల్లో సిబ్బంది పాడి రైతులకు అందుబాటులో ఉండి తగు సలహాలు సూచనలు రైతులకు ఇవ్వాలని ఆయన అన్నారు ఈనెల 16వ తేదీ నుండి 31 వరకు జరిగే నట్టల నివారణ ప్రోగ్రాంలో ప్రతి ఒక్కరూ పాల్గొని నట్టల నివారణ పై రైతులకు తెలియజేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ డైరెక్టర్ లక్ష్మీదేవి పశువైద్యశాల సిబ్బంది పాల్గొన్నారు