Thursday, September 4, 2025

Creating liberating content

రాజకీయాలుఅయ్యో పార్థ ఎంత పనిజరిగింది…?

అయ్యో పార్థ ఎంత పనిజరిగింది…?

మీ సారధ్యంలో లోనే ఇలా జరగడం అంటే..
జోగి అంటే జగనే గుర్తుకొస్తాడు గా ..
నాడు జోగి చేసిన జగడం సామాన్యంగా లేదు గా..
కానీ మీకెన్ని అపార్థాలు వస్తున్నాయో..
మీ సౌమ్యత్వం మంచిదే మరక మాత్రం…!
మీరు ముఖ్యమంత్రి కి విధేయులే ..
ముందస్తు సమాచారం ఉందా.. లేక..
జోగి జగడాలు తెలిసినా జాగ్రత్తలు తీసుకోలేదా..
ఈ జగడాలు ఉహించ లేక పోయారా
అక్కడ గౌతు లచ్చన్న కులం ముఖ్యమే….
ఇప్పుడు జోగితో జతకట్టారని జగడాలు తప్పలేదే..
జోరుగా జరుగుతున్న ప్రచారం ఎటు జారిపోతుందో …?
అసలే రాజకీయ జగడాలు జోరుగా సాగుతుంటే …
ఇక సొంత పార్టీ లో జగడాలకు జర ఆలోచన తప్పదుగా ..
జారిన మాట..జరుగుతున్న జగడం…జరిగిన నష్టానికి జోగినే కారణమా…
ఇక ఇంకేమి జరుగుతాయో మరి…?

(రామమోహన్ రెడ్డి,సంపాదకులు)
పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానం సగటు మనిషి జీవితానికి ఎంత ఉపయోగపడుతుందో అంతే స్థాయిలో మనిషి జీవితాన్ని చిన్నాభిన్నం చేయడానికి ఏమాత్రం తీసిపోలేదని చెప్పడంలో సందేహం అక్కర్లేదు. ఇలా ఎందుకు అనవలసి వస్తుందంటే సమాచార శాఖామంత్రి కొలుసు పార్థసారథి విషయంలో అదే జరిగింది. పాపం పార్థ సారధి తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గ పరిధిలో బీసీ ఆరాద్యుడైనా గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు.అయితే అదే సౌమ్యుడు స్నేహశీలి మృదుస్వభావి అయిన పార్డుడికి సొంత పార్టీ నుండే పొగ బెట్టే కార్యక్రమం పూర్తిస్థాయిలో జరుగుతుంది. ఇక్కడ మంత్రి పార్థసారధి ప్రత్యేకంగా తప్పు చేయకపోయినా కూడా టీడీపీ నుండి ఘోరమైన నిందలు ఎదుర్కోవలసి వస్తుంది. ఆ కార్యక్రమంలో వైసీపీ నేత మాజీమంత్రి జోగి రమేష్ పాల్గొనడం అదికూడా ఓకే వ్యాన్ పై పక్క పక్క నిలబడటం పెద్ద తప్పిదం గా భావించిన టీడీపీ సోషియల్ మీడియా రేచ్చిపోయింది.అయితే ఇలా రెచ్చిపోవాడానికి కారణాలు లేక పోలేదు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జోగి రమేష్ తన స్థాయి మరిచి పోయి సాక్ష్యాత్ నేటి దీక్ష నాటి ప్రతిపక్ష నేత టీడీపీ అధినేత నారాచంద్రబాబు నాయుడు ఇంటిపై దాడికి వెళ్లి నానా యాగీ చేశారు.ఆనాడు వారి హవా కొనసాగింది.అయితే అలాంటి జగడాల వ్యక్తి ఇప్పటి మంత్రి కొలుసు పార్థసారథి వైసీపీలో ఉన్న భావ వ్యక్తీకరణ విషయంలో చాలా పెద్ద తేడా ఉన్నాయి.ఈ నేపధ్యంలో తన ప్రమేయం ఉన్నా లేకున్నా అక్కడ జరుగుతున్న కార్యక్రమం ఒక పార్టీ కి సంబంధించినది కాకపోయినా ప్రజాక్షేత్రంలో ప్రజల ముందు లోన ప్రేమ అభిమానం స్నేహం ఇవేమి లేక పోయినా శత్రువు అయినా సరే పలకరింపు అనేది హుందాతనం. అయితే బహుశా అదే మంత్రి సారధి చేసి ఉండొచ్చు కానీ తనను నమ్మి సీటు ఇచ్చి ఎమ్మెల్యే చేసి మంత్రి పదవి కట్టబెట్టిన పార్టీకి అందులో అటుముఖ్య6 చంద్రబాబు నాయుడుకి ఇటు యువ మంత్రి నారాలోకేష్ లకు తలలో నాలుక లాగా ఉన్న మంత్రి పార్టీ లైన క్రాస్ చేసి మరి వైసీపీ లో ఎవరిని చూసిన వారి ముఖం లో జగన్ ప్రతిబింబం కనిపిస్తుందన్న ధోరణిలో ఉన్న టీడీపీ కి చెడు తెస్తాడాని అనుకోవడం కొంత మేర తొందరపాటు కు గురిచేస్తుందేమో అన్న చర్చ కూడా రాజకీయ వర్గాల్లో జరుగుతుంది. చూడాలి మరి భవిష్యత్ పరిణామాలు ఎలా ఉంటాయన్నది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article