రంగ…రంగ…ఏమిటీ శ్రీరంగ నీతులు…
అక్రిడేషన్ అపర సంజీవిని అయ్యిందా.. అలా చేశారా
అక్రిడేషన్ లేకపోతే అరణ్యముకు పంపిస్తారా..
ఆ నేతలు మూతులు నాకితేనే అన్ని వస్తాయా
ఆ ప్రభుత్వం వారిదే.. ఈ ప్రభుత్వం వీరీదేనా
అలా అనడానికి అది నోరేనా ఇంకెదయినా..?
వైసీపీ ఉన్నప్పుడు ఒక కులం…
కూటమి లో ఇంకోకులమా..
కలానికి కులం అంటగడుతుంటే మీకక్కుర్తికి…?
ఎంఫ్యాన్ల్మెంట్ ఉంటే ఏదయినా చేయోచ్చా ..
ఎంఫ్యాన్ల్మెంట్ ఉంటే ఎన్ని తప్పులైన చేయొచ్చా..
నాడు పెత్తనం చేసింది మీరే కదా..
మీరెందుకు అక్రిడేషన్ లో అక్రమాలకు అడ్డుకట్ట వేయలేదు..
అన్నింటికి ఆ అని అడ్డగోలు చేసి ..
అయ్యా అన్ని ఘోరాలు చూడలేదని అంటారా ..
అది నాలుక లేక తాటిమట్టా..
తప్పులు చేస్తూ తీర్పులు ఇచ్చేది మీరేనా..
మీ అనుభవం దేనికోసం…
ముఖ్యమంత్రి గారు మీకేమైనా చెప్పారా ఇలా ముష్టి పనులు చేయమని..
అక్రిడేషన్ ఇవ్వడంతో ఆర్థిక వ్యవస్థ కుదేలు అవ్వుతుందా..
అక్రిడేషన్ ఇస్తే అమరావతి ఆగిపోతుందా
ఎంఫ్యాన్ల్మెంట్ తో యాడ్స్ పొంది ఎన్ని ఓట్లు వేయించారు. .
మీ ఎంఫ్యాన్ల్మెంట్ పేపర్లు ఎన్నికోట్ల ప్రజలకు తెలుసు..
సంపాదకులు అంటే ఒకటే గా..
ఎంఫ్యాన్ల్మెంట్ ఉంటే మీకు సంపాదన వస్తుందేమో మా సంపాదకత్వం చావదు గా
తెలంగాణ లో దిక్కులేదు.. ఇక్కడ తిక్క చేష్టలేందుకు..
ఇలా చేసే ఆ కస్తూరిని కుట్రలో ఇరికించారా..
మీ కమ్మని మాటలతో ఇంకెన్ని కొంపలు ముంచుతారు..
ఓ కలమా చూస్తున్నావా ఈ కలిమాయ..
కలం శాస్వితం…కాసులు కాదు ..
కలం పై కలమే కుట్రలు చేస్తుంటే..
కవ్వింపు కాదా ఈ పాడు లోకంలో ..
సత్తా ఉంటే సమన్యాయం చెయ్ లేదంటే సమస్య సృష్టించకు..
సత్యాన్ని దాచలేవు…ధర్మాన్ని చెరపలేవు..
నేడు నీది ..రేపు ఇంకొకరిది..
ఏమిటీ దుర్మార్గం . .ఎందుకింత నీచం…
(రామమోహన్ రెడ్డి, సంపాదకులు)
“ఔను నిజం, ఔను నిజంఔను నిజం, నీవన్నది నీవన్నది, నీవన్నది,నీవన్నది నిజం, నిజం!లేదు సుఖం, లేదు సుఖం,లేదు సుఖం జగత్తులో!బ్రదుకు వృథా, చదువు వృథా,కవిత వృథా! వృథా, వృథా!మనమంతా బానిసలం,గానుగలం, పీనుగలం!వెనుక దగా, ముందు దగా,కుడి యెడమల దగా, దగా!మనదీ ఒక బతుకేనా?కుక్కల వలె, నక్కల వలె!మనదీ ఒక బతుకేనా?సందులలో పందులవలె!నిజం సుమీ, నిజం సుమీ,నీవన్నది నిజం సుమీ!బ్రతుకు ఛాయ, చదువు మాయ,కవిత కరక్కాయ సుమీ!లేదు సుఖం, లేదు రసం,చేదు విషం జీవఫలం!జీవఫలం చేదువిషం,చేదు విషం, చేదు విషం!ఔను నిజం, ఔను సుమా,ఔను నిజం నీవన్నది!నీవన్నది, నీవన్నది,నీవన్నది నిజం, నిజం!”మహానుభావుడు శ్రీశ్రీ మహాప్రస్థానంలో ఎంత బాగా చెప్పాడో అదే జరుగుతోంది కాబోలు నేడు. పాపం, పుణ్యం, ప్రపంచమార్గమని అనుకుంటూ కష్టం, సుఖం ఏమీ ఎరుగని పూవుల్లాగా అయిదారేడుల పాపల్లాగా మెరుపు మెరిస్తే,వాన కురిస్తే,ఆకసమున హరివిల్లు విరిస్తేఅవి మాకే అని ఆనందించేకూనల్లాగా అనుకుంటూ అక్రిడేషన్ కమిటీ వేస్తే మాకే ఉండాలని అంతా మాదే నని అదేమిటి ఇదేమిటని ఆలోచన చేయ కుండా ఎచ్చటి కెచటికో ఎగురుతుపోతు ఈలలు వేస్తుంటే మిగిలిన వారందరూ ఎర్రిబాగులోరులాగా ఎదురుచూపులు చూడాలని అనుకోవడం ఎంతవరకు సమంజసం అన్నది ఆలోచన చేయాలి.ఎక్కడ చూస్తే అక్కడ వీరైవిశ్వరూపమున విహరిస్తుండేపరమాత్మలలాగా… పతివ్రత పరమాన్నం వండితే తెల్లార్లు చల్లారకుండా ఉండి నట్లు ఆ ప్రభుత్వంలోనూ అన్ని కుట్రలు చేసి అన్యాయపు పనులు చేసి అన్ని జిల్లాల్లో అక్రిడేషన్ కమిటీ లో వీరి అనుయాయులను నియమించి ఏలుబడి సాగించి ఈ ప్రభుత్వం రాగానే ఆ ప్రభుత్వముపై చిలుక పలుకులు పలుకుతుంటే పక్కున నవ్వుతోంది పత్రికా లోకం.మాదే, మాదే సమస్తవిశ్వం!మేమే ఈ లోకపు భాగ్యవిధాతలని భావిభారత కర్తలమని భావించి అర్హత ఉందొ లేదో చూడక అడ్డగోలు గా అక్రిడేషన్ లు ఇచ్చే విధానంలో అన్ని విధాలా పాలు పంచుకుని అప్పుడు అంతే నాదే కదా యూనియన్ నాయకులంతా నా మాటే వింటారు కదా అని అతిగా ఆశపడిన కస్తూరి అనే అధికారిని ఈ నాడు బాధితురాలిని చేసింది ఈ పెద్ద మనుషులే కాదా అన్నది అందరినోట వినిపిస్తుంటే విస్తుపోయి చూస్తోంది ఈ విచిత్ర పత్రికా ప్రపంచం.అయితే .ఇందులో ఆమె పాండిత్యం కూడా కొంత లేకపోలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.కానీ అసలైన కుట్రలు తెలుసుకోలేక పోవడంతో కూటమి ప్రభుత్వంలో కొంత కాలం కష్టమైన నష్టమైన భరించక తప్పదనుకొండి. కానీ కళ్ళబొల్లి మాటలతో కలాన్ని కించ పరిచే విదంగా కుట్రలు చేసే కామ్రేడ్ లు ఉన్నంత వరకు తప్పదు ఈ కలానికి కళంకితం. ఇక్కడ ప్రధానంగా ప్రతి సంపాదకుడు ప్రత్యక్షంగా గమనించాల్సిన విషయం ఏమిటంటే అక్రిడేషన్ అనేది అపర సంజీవివి చేసిన అపర మేధావులు ఎవరు. అక్రిడేషన్ లేక పోతే అరణ్యములో బ్రతకినట్లేనా…అక్రిడేషన్ ఉంటే పత్రికలు బాగుపడతాయా అక్రిడేషన్ ఉంటే అడ్డగోలు వ్యవహారం చేసుకోవచ్చా అన్నది నిశితంగా ఆలోచన చేయాలి. అక్రిడేషన్ లు ఇప్పిస్తానని మీ అందరికి మేమే నాయకులము అన్న నేతలు ఆ అప్రభుత్వం లో మూతులు నాకీ మొండి వాడు అన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం ముష్టి పనులు చేసి ముష్టిని మూట కట్టుకుని మూతులు తుడుచుకుని కూటమి ప్రభుత్వం రాగానే అబ్బే మాది ఈ కులం అబ్బా ఈ ప్రభుత్వమే మా కుల డైవమంటూ కారుకూతలు కూస్తూ కలాన్ని కించపరిచేలా చేస్తుంటే ఇదేమి కలికాలమురా నాయనా కలాన్ని నమ్ముకున్న వారు కన్నీరు కార్చితే పరువు పోతుందని కన్నీటిని దిగమింగుకుని ఓ కాలమా ఈ కలనికి ఏమిటీ పోయే కాలమని ఆవేదన చెందుతున్నారు. అలాగే ఇంకొక ప్రధాన విషయం ఎంఫ్యాన్ల్మెంట్. ఎంఫ్యాన్ల్మెంట్ అనేది ఏ పత్రిక అయిన చేసుకోవచ్చు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం పత్రిక సంపాదకులు తమ పత్రికను ఇచ్చి చేసుకోవచ్చు. అయితే ఇన్ని సంవత్సరాల కాలం ఎందుకు ఎంఫ్యాన్ల్మెంట్ చేయలేదు. పెండింగ్ లో ఎన్ని దరఖాస్తులు ఉన్నాయని చూస్తే అది అంతుచిక్కని ప్రశ్న.కారణం ఆ కొద్దిమంది మాత్రమే కాసులు సంపాదించి కూడా బెట్టుకుని కోఠీశ్వరులు కావాలి మిగిలిన వారు కాకుల్లా కావు కావు మంటూ కేకలు వేసి కామ్ అవ్వాలి.అర్హులైన వారందరికీ ఎంఫ్యాన్ల్మెంట్ చేస్తే ప్రభుత్వం ఇచ్చే ప్రకటనల్లో పోటీ పెరిగి వాటాలు తగ్గిపోతాయని వీరికి బాధ తప్ప ప్రబుత్వ ఖజానా ఖాళీ అయిపోయి దివాళా తీసే పరిస్థితి రాదు.కార్పొరేట్ దిగ్గజాల కు కట్టబెట్టే కోట్లల్లల్లో కొంత తగ్గిస్తే కొన్ని వందల పత్రికలు కాపాడబడే పరిస్థితి ఉంది.కానీ ఆదిశగా అడుగులు వేసి తాము కొందరి వారము కాదు అందరి వారము అని చెప్పుకోలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నామంటే ఇంతకంటే దిక్కుమాలిన పని ఇంకొకటి ఉంటుందా అని ఊహించు కుంటేనే అసహ్యం వేస్తుంది. పోనీ కనీసం అక్రిడేషన్ అర్హులైన వారందరికీ ఇస్తే నవ్యాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడు కలలు గన్న అంతర్జాతీయ రాజధాని అమరావతి ఆగిపోతుందా అక్రిడేషన్ లు ఆపేస్తే అమరావతి పూర్తవుతుందా… ఎందుకింతలా కొంతమంది పనికిమాలిన వ్యక్తులు ఈ పత్రికా రంగంలో ఉండి చేసేది శివపూజ పోయేది…. అన్నట్లు గా వ్యవహరిస్తున్నారో అర్థం కావడం లేదు చేతనైతే సమస్య పరిష్కారానికి కృషి చేయాలి కానీ సమస్య లేని చోట సమస్య లు సృష్టిస్తూ పైశాచిక ఆనందం పొందిన అది కొంత కాలమే తప్ప శాస్వితం కాదన్నది ఇప్పటికయిన కళ్ళు తెరిచి చూడాలని కలం కోరుకుంటుందని ఆ కొంతమంది గుర్తిస్తే ఈ గమ్యం సుగమముతుందని అభిప్రాయం వ్యక్తమవుతోంది.