-ఓకార్మికుడి ప్రాణం ఖరీదు నాలుగు లక్షలట…
-మీడియాకు ఒక్కొక్కరికి మూడు వేలు..
-పెత్తనం వెలగబెట్టిన ఓ యూట్యూబర్…
-జర్నలిజం కూడా అంగడిలో సరుకుగా మారిందా…
-యూట్యూబర్ ఇంట్లో జరిగినా ఇంతే నీచంగా చూస్తారా..
-బిల్డింగ్ కు అనుమతి ఉందో లేదో మరి…
-పనిచేసే కార్మికుడుకి ప్రమాదం…అక్కడిక్కడే మృతి…
-ఈ అవినీతి అసమర్థ అధికారులు ఉన్నంత వరకు ఇదే…
-ప్రాణానికి విలువ కట్టడానికి వీరేవరు…
-ఇదే ఖరీదు బిల్డింగ్ యజమాని కి కూడా వర్తిస్తుందా…
-సిగ్గులేని అధికారుల తీరుతోనే ఇలా అవుతుందా..
-ఇందులో బిల్డింగ్ ఇన్స్పెక్టర్ పాపం ఎంత…
-ప్రాణం ఖరీదులో టీపీఓ వాటా ఎంత…
-పోలీసులు పాత్రేమిటీ…రాజకీయ నాయకుల వత్తాసు ఎవరికి…
-ఇంకెన్ని ప్రాణాలు బలికొంటారు…

ఏడుకొండల వాడ ఇదేమి విచిత్రమయ్యా…
కృష్ణలంక కొండల చరితము చూడతరమా…
(రామమోహన్ రెడ్డి, సంపాదకులు)
ఆధునిక సమాజంలో అవినీతి అధికారుల తీరు చూస్తే అచ్చర్యపడక తప్పడం లేదు.ఆవినీతి సొమ్ముతిని మదమెక్కిన్న గజపుటేనుగుల వలె అహంకారముతో అక్రమార్జనే తమ అలవాటు మార్చుకుని అన్యాయానికి పాల్పడుతున్నారు. గత ఐదు సంవత్సరాల కాలములో పాలకుల తీరు కూడా అధికారుల అవినీతికి అండగా నిలిచారన్న అపోహ లేకపోలేదు. ముఖ్యంగా బెజవాడ కార్పొరేషన్ అవినీతి కంపులో మ్యూనిగితెలుతుందనే చెప్పాలి.రాష్ట్ర విభజన తరువాత అప్పటి,ప్రస్తుత ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడు అభివృద్ధి ప్రణాళికలు చక్కగా రచించి అమరావతి రాజధాని గా సీఆర్డీఏ ను ఏర్పాటు చేశారు.

సీఆర్డీఏ ప్రకారం కార్పొరేషన్ అనుమతులతో ఇళ్ల నిర్మాణాలు చేపడతారు.కథ ఇక్కడే మొదలవుతుంది. సాధారణంగా ఇళ్ల నిర్మాణం చేపట్టాలంటే కార్పొరేషన్ అధికారులును సంప్రదించి అన్నీ అనుమతులు తీసుకున్నాక నిర్మాణాలు చేపడతారు. అయితే బెజవాడ కార్పొరేషన్ లో అవన్నీ గాలి మాటలే అవుతున్నాయి.ముఖ్యంగా కృష్ణలంకలో అయితే అక్రమ కట్టడాలు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి.డీకేటీ,బీఫామ్ లు ఉన్న పెద్ద పెద్ద భవంతుల నిర్మాణం యథేచ్ఛగా నిర్మిస్తున్నారు.అందులో భాగంగా కృష్ణలంక శంకర మఠం లైన్ లో ఓ బిల్డర్ బహుళ అంతస్తు నిర్మాణం చేపట్టారు.మంగళవారం ఓ కార్మికుడు అక్కడ కబోర్డు పనిచేస్తుండగా విద్యుత్ షాక్ తో మృతి చెందాడు.
పెత్తనం వెలగబెట్టిన ఓ యూట్యూబర్…
పొట్టకూటి కోసం జిల్లాలు దాటి వచ్చిన ఓ కార్మికుడు మంగళవారం ఉదయం బిల్డింగ్ యజమాని ఇచ్చే కూలి కోసం పనిలోకి దిగాడు.అంటే విద్యుత్ షాక్ తో అక్కడికక్కడే ప్రాణాలు వదిలి పెట్టాడు.ఈ సంఘటన వెలుగులోకి రావడం ఆలస్యం యూట్యూబర్ తన పలుకుబడిని ఉపయోగించి మీడియా భేరం పెట్టింది.అంటే ఇక ఏముంది ఓ నిండు ప్రాణం గాలిలో కలిసిపోయి మృతదేహం అక్కడే ఉన్న ఒక్కోక్కరికి మూడు వేలు చొప్పున ముష్టి వేసింది.ముష్టి కోసం మృతదేహాలను కూడా వదలని మీడియా ముసుగులో ఉన్న మాయగాళ్ళు కనీస మానవత్వం లేకుండా యూట్యూబర్ తో చేతులు కలిపి కార్మిక కుటుంబాన్ని నట్టేట ముంచేసి చేతులు దులుపుకొన్నారు.పైగా తానొక సీనియర్ అని ఓ నాలుగో అయిదో యూట్యూబ్ ఛానెల్స్ ఉన్నాయని గొప్పలు చెప్పుకుని ఆ కార్మిక కుటుంబానికి ఓ నాలుగు లక్షలు ఇచ్చి పోలీసులను సైతం కొనేసి కేసు లేదు గీసు లేకుండా చేసి మృతదేహాన్ని అక్కడి నుండి తీసివేసే చర్యలు చేపట్టి అన్నీ చక్కదిద్దు కొన్నారు.
తలా పాపం…తిలా పిరికెడు…
సాధారణంగా అన్నీ రకాల జాగ్రత్తలు తీసుకున్న ప్రమాదం జరుగుతుంటాయి. దానిని ఎవ్వరూ తప్పించలేరు.కానీ ఓ బహుళ అంతస్తు నిర్మాణం చేపట్టేందుకు సిద్ధమైతే కనీస జాగ్రత్తలు కూడా తీసుకోక పోవడం బిల్డర్ నిర్లక్ష్యం అక్కడ కనిపిస్తోంది. విద్యుత్ వైర్లు బిల్డింగ్ కు చాలా దగ్గరగా ఉన్నా ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టకపోవడం కార్మిక కుటుంబం బలైపోయింది. పొట్టకూటి కోసం తమ ప్రాణాలను సైతం లెక్క చేయక పనులు చేసే కార్మికుల పట్ల అవినీతి అధికారులు తమ కక్కుర్తి కోసం అనుమతులు మంజూరు లో కనీస ధర్మాన్ని విస్మరించడంతో కార్మికుని ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.ఇదే సంఘటన మీడియా కుటుంబాల్లో గాని,పెత్తనం వెలగబెట్టిన యూట్యూబర్ కుటుంబంలో కానీ, బిల్డర్ కుటుంబంలో కానీ ఈ అవినీతి అధికారులు కు ఎదురైతే ఇలానే చేసి తలా పాపం తిలా పిరికెడు అంటే ఎంత బాధ పడతారో సాటి మనిషి ప్రాణాలను కూడా అలాంటి విలువ ఇవ్వడం నేర్చుకోవాలి.ధనం ఆశాస్వితం…ఒకరికి చేసిన మేలు శాస్వితం అన్న సూక్తి కొంత మెరైన పాటిస్తే సగటు మనిషిగా కొంత కాలం జీవించిన ఆ జీవనానికి అర్థం పరమార్థం ఉంటుందనేది లోకొత్తర ధర్మం.ఇప్పటికయినా ఈ అవినీతి అధికారులను కట్టడి చేయని పక్షంలో ఇంకెన్ని జీవితాలు అస్తవ్యస్తమవుతాయో మరి.నూతన ప్రభుత్వమైన కొరడా ఝులిపిస్తోందో లేదో మరి వేచి చూడాలి.
