17 ఏళ్ల బాలికపై లైంగిక దాడి కేసులో యడియూరప్పపై కేసు నమోదు
వారెంట్ జారీ చేసిన బెంగళూరు స్పెషల్ కోర్టు
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత యడియూరప్పకు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ అయింది. ఫోక్సో కేసులో ఆయనకు బెంగళూరు స్పెషల్ కోర్టు ఈ వారెంట్‌ను జారీ చేసింది. దర్యాఫ్తు సంస్థ ఆయనను అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. 17 ఏళ్ల బాలికపై లైంగిక దాడి కేసులో యడియూరప్పపై కేసు నమోదయింది. ఈ కేసుకు సంబంధించి విచారణకు హాజరు కావాలని సీఐడీ… మాజీ ముఖ్యమంత్రికి నోటీసులు ఇచ్చింది. రేపు విచారణకు హాజరవుతానని ఆయన దర్యాఫ్తు సంస్థకు సమాధానం ఇచ్చారు.