వేంపల్లె
సకల దేవతల నిత్యపూజలకు సంబంధించిన గ్రంధాలను భక్తులకు పంపిణీ చేసినట్లు అవోపా మహిళ విభాగం అధ్యక్షురాలు పచ్చిపులుసు ప్రవీణ తెలిపారు. శుక్రవారం స్థానిక వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయం వద్ద ఈ కార్యక్రమం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ అవోపా మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు ఆరవేటి నిర్మల సహకారంతో ప్రచురించిన పూజ గ్రంధాలు భక్తులకు పంపిణీ చేశామని, భక్తులు కూడా వీటిని సరైన విధానాలతో సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అవోపా అధ్యక్షుడు బిజిఎస్ సునిల్, మహిళా ఉపాధ్యక్షురాలు బైరిశెట్టి నాగలక్ష్మి, తదితర సభ్యులు పాల్గొన్నారు.