Sunday, February 15, 2026

Creating liberating content

సినిమానిహారిక 'కమిటీ కుర్రోళ్లు' చిత్రానికి అవార్డు

నిహారిక ‘కమిటీ కుర్రోళ్లు’ చిత్రానికి అవార్డు

మెగా డాటర్ కొణిదెల నిహారిక సమర్పణలో వచ్చిన చిత్రం కమిటీ కుర్రోళ్లు. చిన్న చిత్రమే అయినా విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు, అవార్డులను సైతం కొల్లగొడుతోంది. తాజాగా ఈ చిత్రానికి మాస్టర్ పీస్ ఆఫ్ తెలుగు సినిమా-2024 అవార్డు లభించింది. దాదాసాహెబ్ ఫాల్కే ఎంఎస్కే ట్రస్ట్ అవార్డుల కార్యక్రమంలో కమిటీ కుర్రోళ్లు చిత్రానికి అవార్డు అందించారు.11 మంది కొత్త హీరోలతో, నలుగురు హీరోయిన్లతో యదు వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కమిటీ కుర్రోళ్లు. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్ఎల్ పీ, శ్రీరాధా దామోదర స్టూడియోస్ బ్యానర్లపై ఈ చిత్రం నిర్మాణం జరుపుకుంది. ఆగస్టు 9న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article