బీజేపీ, ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల అధినేతలు, కొత్తగా ఎన్నికైన లోక్‌సభ అభ్యర్థులతో ఢిల్లీలో ఎన్డీఏ సమావేశం జరిగింది. తమ పాత పార్లమెంట్ భవనం సెంట్రల్ హాల్‌లో జరిగిన ఈ సమావేశంలో వేదికపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ఆసీనులయ్యారు. జేడీఎస్- హెచ్ డీ కుమారస్వామి, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ- అజిత్ పవార్, అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, జేపీ నడ్డా, జేడీయూ- నితీష్ కుమార్, శివసేన- ఏక్‌నాథ్ షిండే, లోక్ జన్‌శక్తి పార్టీ (రామ్ విలాస్ పాశ్వాన్)- చిరాగ్ పాశ్వాన్, హిందుస్తానీ ఆవామీ మోర్చా- జీతన్ రామ్ మాంఝీ వేదికపై కూర్చున్నారు. ఇందులో పాల్గొనడానికి వచ్చిన పవన్ కల్యాణ్.. ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కొత్తగా లోక్‌సభకు ఎన్నికైన పలువురు ఎంపీలు ఆయనతో మాట్లాడటం, షేక్ హ్యాండ్ ఇవ్వడం కనిపించింది.
