చంద్రగిరి:చంద్రగిరి నియోజకవర్గ శాసనసభ్యులు,డాక్టర్ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మరియు తుడా చైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి నియోజక వర్గంలో జరుగుతున్న పెళ్లిళ్లకు సొంత నిధులతో పెళ్లి కానుకను అందిస్తున్నారు. అందులో భాగంగా చంద్రగిరి మండలం, చంద్రగిరి పంచాయతీ, కొత్తపేట, బజార్ వీధి నందు నివాసం ఉంటున్న ఎం. ప్రసాద్ మరియు బి. లీలావతి అనే వధువరులకి మార్చి1వ తేదీన పెళ్లి సందర్భంగా బంగారు తాళి బొట్టు, వెండి మెట్టెలు, వదూ వరులకు బట్టలు, స్వీట్స్ మరియు గ్రీటింగ్ కార్డ్ మన ఎమ్మెల్యే పంపించడం జరిగింది. ఈ పెళ్లి కానుకను డివిజన్ అధ్యక్షులు కుప్పిరెడ్డి భాస్కర్ రెడ్డి, చంద్రగిరి మండలం పార్టీ అధ్యక్షులు మస్తాన్ ,ఎంపీటీసీ అజీజా నశ్రత్, జర్ బాహార్, సోషల్ మీడియా కో కన్వీనర్ రాజశేఖర్, సచివాలయం కన్వీనర్ కాశీ నాగేశ్వర్ రావు చేతుల మీదుగా అందజేయడం జరిగింది.