జగ్గంపేట
కాకినాడ జిల్లా జగ్గంపేట లో మరో నూతన బ్యాంక్ కెనరా బ్యాంక్ ప్రారంభోత్సవం జరిగింది. స్థానిక సర్వీస్ రోడ్ లో విక్టరీ బజార్ పక్కన కొత్త కొండబాబు ( శ్రీ) కాంప్లెక్స్ లో కెనరా బ్యాంక్ నూతన శాఖను కెనరా బ్యాంక్ జనరల్ మేనేజర్ విజయవాడ పి రవివర్మ చేతుల మీదుగా ప్రారంభించారు. కెనరా బ్యాంక్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ కాకినాడ ఆర్ గణేష్ జ్యోతి ప్రజ్వలనచేశారు. విశిష్ట అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగ్గంపేట పరిసర ఖాతాదారుల సౌకర్యార్థం ఈ బ్రాంచ్ ప్రారంభిస్తున్నామని ఈ బ్రాంచ్ అన్ని సేవలు అందుబాటులో ఉన్నాయని గోల్డ్ లోన్స్, కార్ లోన్స్, అగ్రికల్చర్ లోన్స్, హౌసింగ్ లోన్స్ మా బ్యాంకులో లభించును అని మా బ్యాంకులో సేవలను ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని ఈ ప్రాంత ప్రజలను ఖాతాదారులు కోరారు. ఈ కార్యక్రమంలో జగ్గంపేట ఆర్యవైశ్య సేవా సంఘం అధ్యక్షులు కొత్త కొండబాబు, ఎస్వీఎస్ అప్పలరాజు, పారిశ్రామికవేత్త కొత్త బైరవ కృష్ణ, జగ్గంపేట కెనరా బ్యాంక్ మేనేజర్ పి. గోవిందరావు, కొత్త సుధీర్, బొండా సుబ్బరాజు, జగ్గంపేట ప్రాంత ప్రజలు ఖాతాదారులు పాల్గొన్నారు.
