Sunday, February 15, 2026

Creating liberating content

తాజా వార్తలునేషనల్ క్రికెట్ అసోసియేషన్ కి పోరుమామిళ్ల సెయింట్ ఆంటోనీ విద్యార్థులు ఎంపిక హర్షనీయం

నేషనల్ క్రికెట్ అసోసియేషన్ కి పోరుమామిళ్ల సెయింట్ ఆంటోనీ విద్యార్థులు ఎంపిక హర్షనీయం

సర్పంచ్ చిత్తా రవిప్రకాష్ రెడ్డి

పోరుమామిళ్ల
కర్నూల్ లో నిర్వహించిన సూపర్ సెవెన్ క్రికెట్ ఛాంపియన్షిప్ 2024 కు పోరుమామిళ్ళ సెయింట్ ఆంటోనీస్ హై స్కూల్ తరఫున స్టేట్ క్రికెట్ అసోసియేషన్ కు ఆడిన ఇద్దరూ విద్యార్థులు, చరణ్ తేజ్ మరియు గురుదీప్ నేషనల్ క్రికెట్ అసోసియేషన్ కి సెలెక్ట్ అవ్వడం జరిగిందని. స్కూల్ ప్రిన్సిపల్ సునందరెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా సోమవారం
రంగసముద్రం సర్పంచ్, యంటిఎఫ్ అధినేత డాక్టర్ చిత్తా రవి ప్రకాష్ విద్యార్థులను అభినందించి సర్టిఫికేట్ అందించడం జరిగింది. స్కూల్ ప్రిన్సిపల్ చిత్తా సునందా రెడ్డి అభినందనలు తెలుపుతూ అతి తక్కువ కోచింగ్ తో నే తమ విద్యార్థులు అసోసియేషన్ కి సెలెక్ట్ అవ్వడం తనకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు. స్పోర్ట్స్ లో మరింత ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని చెప్పి క్రికెట్ కోచ్ అయిన స్కూల్ పిఈటి టీచర్ నీ ప్రశంసిస్తూ ఆయనను సత్కరించారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి ముత్యాల ప్రసాద్ అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article