దామలచెరువులో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన నారా భువనేశ్వరి..!

చంద్రగిరి:
చంద్రగిరి నియోజకవర్గం, పాకాల మండలంలో నిజం గెలవాలి యాత్రలో భాగంగా నారా భువనేశ్వరి గురువారం దామలచెరువుకు చేరుకొన్నారు.ఈమెకు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని,పులివర్తి సుధారెడ్డి,పులివర్తి వినీల్ కు ఘన స్వాగతం పలికారు.పాకాల మండలం దామలచెరువులో నారా భువనేశ్వరి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.నారా భువనేశ్వరి ని జనసేన,టీడీపీ నాయకులు గజమాలతో సత్కరించారు.ఈ సందర్భంగా నారా భువనేశ్వరి మాట్లాడుతూ అన్యాయంగా చంద్రబాబు నాయుడును 53 రోజులు జైల్లో పెట్టారు.చంద్రబాబు పై ఇప్పటికి ఒక్క ఆధారాన్ని బయటపెట్టలేక పోయారనిపేర్కొన్నారు.

చాలా మంది అభిమానులు మనస్తాపంతో గుండెలు ఆగాయి,వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పటానికి నిజం గెలవాలి కార్యక్రమం చేపట్టానుఅని తెలిపారు.టిడిపి కార్యకర్తలు ఐదు సంవత్సరాలుగా బాధలు పడ్డారు..పడుతూనే ఉన్నారు.టీడీపీ కార్యకర్తలపై కేసులు పెట్టటం,ఆస్తులు బలవంతంగా రాసుకోవటం,లాక్కోవడం పనిగా పెట్టుకున్నారని తెలిపారు.చాలా మంది టీడీపీ కార్యకర్తలను చంపేశారని పేర్కొన్నారు.ఈ ప్రభుత్వానికి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని ధ్యాసే లేదని అన్నారు .చేయి చేయి కలిపి తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్లాలని నారా భువనేశ్వరి అన్నారు.ఈ కార్యక్రమంలో టిడిపి,జనసేననాయకులు,కార్యకర్తలు,మహిళలు,తదితరులు పాల్గొన్నారు.
