జగన్‌కి మంత్రి నారా లోకేష్ కౌంటర్..
నారా లోకేష్ “రెడ్ బుక్” అంశంపై వైసీపీ అధినేత జగన్ చేస్తోన్న విమర్శలకు సమాధానమిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. “రెడ్ బుక్” గురించి జగన్ తరచుగా ప్రస్తావించడం వల్ల చర్చా అంశంగా మారింది. జగన్ ఈ అంశాన్ని మీడియా ముందు ఉంచుతూ, రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవని, “రెడ్ బుక్ రాజ్యాంగం” నడుస్తోందని విమర్శిస్తున్నారు.అయితే, టీడీపీ ఈ విషయంలో సైలెంట్‌గా ఉండడం చూస్తున్న నారా లోకేష్ స్వయంగా రంగంలోకి దిగారు. ఆయన శుక్రవారం గుంటూరు జిల్లా తాడేపల్లిలోని నులకపేటలో అన్న క్యాంటీన్ ప్రారంభించినప్పుడు ఈ అంశంపై మాట్లాడారు. లోకేష్ ఈ సందర్భంగా జగన్ చేస్తున్న ఆరోపణలను తిరస్కరిస్తూ, చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై చర్యలు తప్పవని స్పష్టం చేశారు. “రెడ్ బుక్” విషయంలో ప్రజలకు హామీ ఇచ్చానని, దానికి కట్టుబడి ఉన్నానని, ప్రజలు తమను నమ్మి మంచి తీర్పు ఇచ్చారని చెప్పారు.ముఖ్యంగా జగన్ ప్రభుత్వం చేసిన అవినీతి, లిక్కర్, ఇసుక దందాలపై చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని లోకేష్ ప్రస్తావించారు. మిగతా విషయాల గురించి మాట్లాడుతూ, జగన్ కేవలం అబద్దాలు చెప్పి ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారని, అందుకే ఆయనకు “ఫేక్ జగన్” అనే పేరు పెట్టారని అన్నారు. టీడీపీ అన్న క్యాంటీన్లు నిర్వహణ కోసం విరాళాలు సేకరించడం గురించి వైసీపీ విమర్శలు చేస్తుండటంపై, ఈ విరాళాలు సైకోల బారి నుంచి పేదలను రక్షించడానికే అని పేర్కొన్నారు.మొత్తానికి, జగన్ చేస్తున్న విమర్శలకు మరియు ఆరోపణలకు నారా లోకేష్ తనదైన శైలిలో సమాధానం ఇచ్చి, తనపై ఉన్న నమ్మకాన్ని ప్రజలకు తెలియజేశారు.మాజీ మంత్రి జోగి రమేష్ కొడుకు వ్యవహారం గురించి కీలక విషయాలు వెల్లడించారు మంత్రి. అగ్రిగోల్డ్ భూమి పత్రాలు తీసుకుని, ఫేక్ పత్రాలు క్రియేట్ చేసి.. ఆయా భూములను సొంతం చేసుకున్నారని తెలిపారు. ఆ తర్వాత వాటిని అమ్మేశాడన్నారు. ఇలాంటి వాటిపై యాక్షన్ తీసుకోకూడదా? అంటూ ప్రశ్నించారు. ఇంకా లిక్కర్, ఇసుక దందాలపై చర్యలు తప్పవంటూ సంకేతాలు ఇచ్చేశారు.ఒక అబద్దాన్ని పదేపదే చెబితే నిజం అవుతుందని జగన్ భావిస్తున్నారని అన్నారు మంత్రి నారా లోకేష్. అందుకే ఫేక్ జగన్ అని పేరు పెట్టామన్నారు. చివరకు అన్న క్యాంటీన్ల నిర్వహణకు వచ్చే విరాళాలపైనా ఆ పార్టీ ఏడుస్తోందని దుయ్యబట్టారు. సైకోల బారి నుంచి పేదలని రక్షించడానికే విరాళాలు సేకరిస్తున్నట్లు తెలియజేశారు. మొత్తానికి జగన్ చేసిన కామెంట్స్‌కు ఫుల్ స్టాప్ పెట్టారు మంత్రి నారా లోకేష్.

