Sunday, February 15, 2026

Creating liberating content

తాజా వార్తలుదేవాన్ష్ బర్త్ డే.. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నారావారి కుటుంబం

దేవాన్ష్ బర్త్ డే.. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నారావారి కుటుంబం

టీడీపీ అధినేత చంద్రబాబు మనవడు నారా దేవాన్ష్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా నారా కుటుంబ సభ్యులు తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు. నారా లోకేశ్, భువనేశ్వరి, బ్రహ్మణి, దేవాన్ష్ శ్రీవారి సేవలో పాల్గొన్నారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ‘నిజం గెలవాలి’ యాత్రలో ఉన్న భువనేశ్వరి నిన్న రాత్రి తిరుమలకు చేరుకున్నారు. లోకేశ్, బ్రహ్మణి, దేవాన్ష్ నిన్న సాయంత్రమే తిరుమలకు వచ్చారు. దేవాన్ష్ ప్రతి పుట్టిన రోజున తిరుమలలో అన్నదానం చేస్తున్నారు. ఈసారి కూడా అన్నదానం చేశారు. అన్నప్రసాద సముదాయంలో భక్తులకు అల్పాహారాన్ని వడ్డించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article