Tuesday, February 17, 2026

Creating liberating content

తాజా వార్తలుజగన్ ను పాతాళానికి తొక్కడం పవన్ వల్ల కాదు : అంబటి

జగన్ ను పాతాళానికి తొక్కడం పవన్ వల్ల కాదు : అంబటి

పవన్ కల్యాణ్ నాలుగో పెళ్లాం నాదెండ్ల మనోహర్

జనసేన అధినేత పవన్ కల్యాణ్, ఆ పార్టీ కీలక నేత నాదెండ్ల మనోహర్ పై ఏపీ మంత్రి అంబటి రాంబాబు అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ నాలుగో పెళ్లాం నాదెండ్ల మనోహర్ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ ను పాతాళానికి తొక్కేస్తానని పవన్ అన్నారని… అది జరగాలంటే పవన్ ను పుట్టించిన వాళ్లు రావాలని అన్నారు. పవన్ గొప్పా? లేక జగన్ గొప్పా? అనేది జనసైనికులే చెపుతారని అన్నారు. పవన్ అంటే తనకు ఎంతో గౌరవం ఉందని… ఆయన మంచి నటుడని అంబటి అన్నారు. అయితే ఆయన రాజకీయాలకు పనికిరారని చెప్పారు. పిచ్చిపిచ్చి సినిమా డైలాగులు కొడుతున్నారని విమర్శించారు. పవన్ చీప్ బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడుతున్నారని… పవన్ ను నమ్ముకుంటే కుక్క తోక పట్టుకుని గోదారి ఈదినట్టేనని అన్నారు. చంద్రబాబును జైల్లో పెట్టినప్పుడు బాధ కలిగిందని పవన్ అన్నారని… మరి వంగవీటి రంగాను హత్య చేసినప్పుడు బాధ కలగలేదా? అని ప్రశ్నించారు. ముద్రగడను వేధించినప్పుడు బాధ కలగలేదా? అని అడిగారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article