అక్కడ ఆ క్షణాన
రెండు జననాలు..
ఒక అమ్మకి బిడ్డ పుట్టింది..
ఆ బిడ్డ కోసం
ఓ అమ్మ మళ్లీ పుట్టింది..!
అమ్మకి అంత క్షమ ఎలా..
నువ్వు చేసిన తప్పులు
పురిటినొప్పుల పాటి కావుకదా..!
నీ జీవితంలో
అమ్మ ఒక పాత్ర మాత్రమే..
కాని అమ్మ జీవితమే నువ్వు.!
అమ్మ కథ ఎంత రాసినా సశేషమే..
ప్రతి పేజీ విశేషమే..!
బొమ్మను మాత్రమే
చేస్తాడు బ్రహ్మ..
ప్రాణం పోసేది అమ్మ..
నారు పోస్తాడేమో విధాత..
నీరు పోసేది తల్లి..!
నువ్వు జీవితంలో ఎన్ని విజయాలు సాధించినా
తొలి గెలుపు
అమ్మ కడుపున పుట్టడమే..!
కుండ మోస్తూ అమ్మ శవం
ముందు నడుస్తున్నావా..
నీ కళ్ళు చెమరుస్తున్నాయా..
నీ కాళ్ళు కాలుతున్నాయని
వెనక అమ్మ మౌనంగా రోదిస్తోంది చూడు..!
సురేష్..9948546286