Thursday, February 12, 2026

Creating liberating content

సినిమానా పేరును రాజకీయంగా వాడుకోవద్దు: మోహన్ బాబు వార్నింగ్

నా పేరును రాజకీయంగా వాడుకోవద్దు: మోహన్ బాబు వార్నింగ్

తన పేరును కొందరు వ్యక్తులు రాజకీయంగా ఉపయోగించుకుంటున్నట్టు ఈ మధ్య కాలంలో తన దృష్టికి వచ్చిందని ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు తెలిపారు. దయచేసి ఏ పార్టీ వారైనా తన పేరును వారి స్వప్రయోజనాల కోసం వాడుకోవద్దని కోరుతున్నానని చెప్పారు. మనం అనేక భావావేశాలున్న వ్యక్తుల ప్రపంచంలో జీవిస్తున్నామని.. ఎవరి అభిప్రాయాలు వారివని, అది వారి వ్యక్తిగతమని అన్నారు. చేతనైతే నలుగురికి సాయపడటంలోనే మనం దృష్టి పెట్టాలి గానీ, సంబంధం లేని వారిని రాజకీయ పార్టీలలోకి, వారి వారి అనుబంధ సంస్థల్లోకి తీసుకురావడం బాధాకరమని చెప్పారు. తనకు అండదండగా ఉన్న ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేస్తున్నానని..శాంతి, సౌభ్రాతృత్వాలను వ్యాపింపజేయడంలో అందరం బద్ధులై ఉందామని కోరుకుంటున్నానని తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article