Monday, February 16, 2026

Creating liberating content

తాజా వార్తలుమొగలి రేకులు సీరియల్ నటుడు పవిత్రనాథ్ కన్నుమూత

మొగలి రేకులు సీరియల్ నటుడు పవిత్రనాథ్ కన్నుమూత

బుల్లితెరపై సంచలనం సృష్టించిన సీరియల్స్ అంటే కచ్చితంగా గుర్తుకు వచ్చేవి చక్రవాకం, మొగలిరేకులు. ఈ రెండు సీరియల్స్ బుల్లితెరను కొన్ని సంవత్సరాల పాటు శాసించాయి.ఇక సీరియల్లో నటించిన నటీనటులను ప్రేక్షకులు అంత త్వరగా మర్చిపోలేరు. స్రవంతి, ఇంద్ర, ఇక్బాల్, దయ ఇలా అన్ని పాత్రలు ప్రేక్షకులపై చెరగని ముద్ర వేశాయి. ఇప్పటికీ వారంతా ఓ ఫ్యామిలీలానే ఉంటారు. ఈ క్రమంలో ఓ చేదువార్త వెలుగులోకి వచ్చింది. చక్రవాకం, మొగలి రేకులు సీరియల్స్లో ఇంద్ర తమ్ముడిగా దయ పాత్రలో మెప్పించిన నటుడు పవిత్రనాథ్ కన్నుమూశారు.మొగలిరేకులు సీరియల్‌లో దయగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన చిన్నవయసులోనే మరణించారు. ఈ విషయాన్ని నటుడు ఇంద్రనీల్‌ భార్య మేఘన సోషల్‌ మీడియాలో వెల్లడించింది. ‘ఈ బాధను మేము వర్ణించలేకపోతున్నాం.. మా జీవితాల్లో నువ్వు ఎంతో ముఖ్యమైనవాడివి. నీ మరణవార్త అబద్ధమైతే బాగుండనిపిస్తోంది. ఇది నిజం కాకూడదు.. నువ్వు మమ్మల్ని వదిలి వెళ్లిపోయావనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాం. చివరి చూపు కూడా.. కనీసం ఆఖరి చూపు కూడా చూసుకోలేకపోయాం. గుడ్‌బై కూడా చెప్పలేకపోయాం. నిన్ను ఎంతో మిస్‌ అవుతున్నాం.. నీ ఆత్మకు శాంతి చేకూరాలి. ఆ భగవంతుడు నీ కుటుంబానికి మరింత శక్తినివ్వాలి’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ పెట్టింది. అయితే నటుడి మరణానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. కాగా బుల్లితెరపై సంచలనం రేపిన మొగలిరేకులు, చక్రవాకం సీరియల్స్‌లో పవిత్రనాథ్‌ ముఖ్యపాత్రలో నటించారు. ‘మొగలిరేకులు’ ధారావాహికలో ఇంద్రనీల్‌ తమ్ముడు దయగా మెప్పించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article