సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు ప్రధాని మోదీ. ప్రధానితో పాటు ముఖ్యులకు మాత్రమే ఆలయంలోకి అనుమతించారు. ఆలయం చుట్టు పక్కల ప్రాంతాల్లో భారీ భద్రత ఏర్పాటు చేశారు పోలీసులు. ఆలయ అర్చకులు ప్రధాని మోదీకి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. దర్శనం తరువాత హారతి అందజేశారు. శాలువాతో ప్రధానిని సత్కరించి అమ్మవారి చిత్రపటాన్ని ఇచ్చి, వేద ఆశీర్వదం అందజేశారు. సికింద్రాబాద్ మహంకాళి ఆలయంలో అమ్మవారిని దర్శించుకున్న తర్వాత ప్రధాని మోదీ.. సంగారెడ్డి జిల్లాకు వెళ్లనున్నారు. ఈ పర్యటన కోసం నిన్న ప్రధాని రాజ్ భవన్ లోనే బస చేశారు. ఆయన కోసం రాజ్ భవన్ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పటిష్టమైన భద్రత ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు పోలీసు ఉన్నతాధికారులు.