Monday, February 16, 2026

Creating liberating content

తాజా వార్తలుక్షత్రియ వనభోజనాలకు హాజరైన ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రూ, దాట్ల బుచ్చిరాజు

క్షత్రియ వనభోజనాలకు హాజరైన ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రూ, దాట్ల బుచ్చిరాజు

జగ్గంపేట

స్థానిక గోకవరం రోడ్డులో గల అల్లూరి సీతారామరాజు క్షత్రియ ఫంక్షన్ హాల్ లో జగ్గంపేట ఏరియా క్షత్రియుల వన మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జగ్గంపేట శాసనసభ్యులు తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యులు జ్యోతుల నెహ్రూ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల బుచ్చిరాజు హాజరై క్షత్రియ వనమహోత్సవం పాల్గొన్నారు. జ్యోతుల నెహ్రూను, దాట్ల బుచ్చి రాజును క్షత్రియ పరిషత్ నాయకులు ఘనంగా సత్కరించి మన్యం వీరుడు స్వతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు విగ్రహాలను జ్ఞాపికగా అందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర టిడిపి కార్యదర్శి ఎస్వీఎస్ అప్పలరాజు, పెద్దాపురం మున్సిపల్ మాజీ చైర్మన్ రాజా సూరిబాబురాజు, టిడిపి నాయకులు మారిశెట్టి భద్రం జీను మణిబాబు, జగ్గంపేట ప్రాంత క్షత్రియులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article