ప్రొద్దుటూరు జరగబోవు సార్వత్రిక ఎన్నికలలో బొల్లవరం 1 వార్డు ప్రజలంతా సమిష్టిగా ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి కోరారు. శుక్రవారం
త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికలలో భాగంగా ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలోని 1వ వార్డు లో వైఎస్ఆర్సిపి రాష్ట్ర అదనపు కార్యదర్శి పోరెడ్డి నరసింహారెడ్డి ఆధ్వర్యంలో ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు.

ప్రొద్దుటూరు శాసనసభ అభ్యర్థి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి వారి సతీమణి రాచమల్లు రమాదేవి శాసనసభ అభ్యర్థిగా 3వ సారి రాచమల్లు శివప్రసాద్ రెడ్డిని పార్లమెంటు అభ్యర్థిగా వైయస్ అవినాష్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. తొలి రోజు బొల్లవరంలో ప్రచారం నిర్వహిస్తే ప్రజల ఆదరణ మరువలేనిదన్నారు. గతంలో తనకు 2 పర్యాయాలు బొల్లవరంలో స్పష్టమైన మెజారిటీ ఇచ్చారని, దీనిని కొనసాగించాలని కోరారు. 1వ వార్డుకు 31 కోట్ల 81 లక్షల సంక్షేమం, 3 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు కౌన్సిలర్ పందిటి సరోజమ్మ, వార్డు నాయకులు పోరెడ్డి నరసింహారెడ్డి ఆధ్వర్యంలో జరిగాయని వివరించారు. కావున జరిగిన మేలును చూసి తిరిగి వైసీపీ ని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ భీమునిపల్లి లక్ష్మీదేవి నాగరాజు, వార్డు కౌన్సిలర్ పందిటి సరోజమ్మ, వార్డు ఇంచార్జ్ మరియు బొల్లవరం వెంకటేశ్వర స్వామి దేవాలయ చైర్మన్ గోన ప్రభాకర్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ గోన సరస్వతి, మాజీ కౌన్సిలర్ సౌరీ సుభాష్ రెడ్డి, నియోజకవర్గంలోని వైఎస్ఆర్సిపి ముఖ్య నాయకులు, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, మహిళా నాయకురాళ్లు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.