ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూకు ఆహ్వానం
జగ్గంపేట
జగ్గంపేట మండలం ఇర్రిపాక ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ స్వగృహంలో భూపతిపాలెం పూర్వ విద్యార్థుల ప్రతినిధులు ఈనెల 29న జరిగే భూపతి పాలెం పూర్వ విద్యార్థుల మహాసమ్మేళనంకు ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ను ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1983 సంవత్సరంలో భూపతిపాలెం రెసిడెన్షియల్ స్కూల్ ప్రారంభమైందని అప్పటినుండి 42 సంవత్సరాలుగా అనేకమంది విద్యార్థులు భూపతి పాలెం స్కూల్లో చదువుకుని తమ బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకున్నారని అనేక రంగాల్లో రాణించి దేశంలో అనేక రాష్ట్రాల్లో అనేక సంస్థల్లో ఉద్యోగాలు చేస్తూ ఈనెల 29వ తేదీన 42 సంవత్సరాల పూర్వపు విద్యార్థులు అందరూ మహాసమ్మేళనం కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ను ముఖ్యఅతిథిగా ఆహ్వానించామని జ్యోతుల నెహ్రూ ఎమ్మెల్యేగా విజయం సాధించిన తర్వాత భూపతిపాలెం రెసిడెన్షియల్ స్కూల్ పై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ విద్యార్థులందరికీ మౌలిక వసతులు కల్పిస్తూ ఇంటర్మీడియట్ వరకు విద్యాభ్యాసం పొడిగిస్తూ ప్రభుత్వం ద్వారా ఉత్తర్వులు తీసుకువచ్చి భూపతిపాలెం రెసిడెన్షియల్ స్కూల్ అభివృద్ధికి సహకరిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియజేసి వారిని ఈ మహా సమ్మేళనానికి కుమార్, పరమహంస తదితరులు పాల్గొన్నారు.