పండగ వాతావరణంలో పల్లె పండుగ కార్యక్రమం
ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ
గండేపల్లి :బుధవారం గండేపల్లి మండలంలో పలు గ్రామాలలో పల్లె పండగ వారోత్సవాలలో భాగంగా పలు అభివృద్ది పనులకు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, జనసేన ఇన్చార్జి తుమ్మలపల్లి రమేష్ ను శంకుస్థాపనలు చేశారు. ముందుగా మురారి గ్రామంలో రూ. కోటి 50 లక్షలతో సి.సి రోడ్లు, డ్రైన్లు నిర్మాణానికి గండేపల్లి గ్రామంలో రూ.30 లక్షలు, మల్లేపల్లి గ్రామంలో రూ.40 లక్షలు, సుబ్బయ్యమ్మ పేట గ్రామంలో రూ.10లక్షలు ఉప్పలపాడు గ్రామంలో రూ.25 లక్షలు రూపాయలతో సి.సి రోడ్లు, డైన్లు నిర్మాణం నకు భూమిపూజ చేసి శిలా పలకాలను ప్రారంబించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో సంక్షేమాన్ని అభివృద్ధిని సమపాళ్లలో అందించాలని పల్లె పండుగ కార్యక్రమం తీసుకుని ఈరోజు గ్రామీణ అవసరాలు తీర్చాలనే ఉద్దేశంతో ప్రణాళికా బద్దంగా అభివృద్ధిని కూడా అందించాలని ఈ పల్లె పండుగ కార్యక్రమం తీసుకుని పండగ వాతావరణం లో నిర్వహిస్తున్నామని అన్నారు. గ్రామాభివృద్ది కోసం నిధులు మంజూరు చేసిన ఘనత ముఖ్యంత్రి చంద్రబాబు నాయుడు కి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి దక్కిందన్నారు. ఇవన్నీ కేవలం మూడు నెలల కాలంలోనే సాధ్యపడ్డాయని భవిష్యత్తులో రాష్ట్రంలో ఎవరు ఊహించని విధంగా అభివృద్ది జరుగుతుందని దీపావళికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందించేపథకాన్ని ప్రారంభిస్తామని అంచలంచెలుగా ప్రజలందరికీ సూపర్ సిక్స్ పథకాలన్నీ అందిస్తామని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. ఈ కార్యక్రమంలో కోర్పు లచ్చయ్య దొర, పోతుల మోహనరావు,పరిమి బాబు,కందుల చిట్టిబాబు,కుంచే రాజా, జాస్తి వసంత్,యలమాటి కాశి,అడబాల భాస్కరరావు,అడబాల ఆంజనేయులు,బోండా శ్రీనుబాబు జగ్గంపేట నియోజకవర్గం, గండేపల్లి మండల కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
