శంఖుస్థాపన చేసిన ఎమ్మెల్యే దివ్య
తుని :ప్రజా అవసరాలకు అనుగుణంగా తుని నియోజవర్గంలో అభివృద్ధి పనులు జోరందుకున్నాయి.పధకమేదయినా నిధులు రాబట్టడంలో ఎమ్మెల్యే యనమల దివ్య సఫలీకృతులవుతున్నారు.
గ్రామాల్లో మౌలిక సదుపాయాలకు పెద్ద పీట వేసిన ఎమ్మెల్యే ఆదిశగా ప్రణాళికలు అమలు చేస్తున్నారు.ఇందులో భాగంగా తొండంగి మండలం గోపాలపట్నానికి రక్షిత మంచినీటి పధకానికి మంజూరు చేయించారు ఈపధకానికి ఇవాళ ఎమ్మెల్యే దివ్య సీనియర్ నేత యనమల రాజేష్ తో కలిసి భూమి పూజ చేసారు .అంతకు ముందు ఎమ్మెల్యే యనమల దివ్య కు గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు.మండల టీడీపీ అద్యక్షుడు చొక్కా అప్పారావు అధ్యక్షతన జరిగిన ఈకార్యక్రమంలో జిల్లా మత్స్య కార సంఘం అద్యక్షుడు కోడా వెంకటరమణ,కొయ్యా కేశవ్ తో పాటు గోపాలపట్నం నాయకులు ఎడ్ల సూరిబాబు పాల్గొన్నారు