తాజా వార్తలురాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీతతో ఎమ్మెల్యే దగ్గుపాటి భేటి
రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీతతో ఎమ్మెల్యే దగ్గుపాటి భేటి
- అనంతపురంలోని పరిటాల నివాసానికి వెళ్లిన ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్
- అభివృద్ధికి సంబంధించిన అంశాల గురించి చర్చించుకున్న నేతలు
- తన స్వగ్రామం బండమీదపల్లిలో పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి చర్చ ప్రజాభూమి బ్యూరో, అనంతపురము
మాజీ మంత్రి, రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీతను
అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ మర్యాద పూర్వకంగా కలిశారు. బుధవారం నగరంలోని పరిటాల నివాసానికి ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ వెళ్లారు. ఎమ్మెల్యే సునీతతో సుమారు అరగంట పాటు పలు అంశాల గురించి చర్చించుకున్నారు. అనంతపురం నగరం- అనంతపురం రూరల్ పరిసర ప్రాంతాల్లో ఉన్న సమస్యలు, అక్కడ చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి ఇరువురు నేతలు చర్చించారు. అలాగే ఎమ్మెల్యే దగ్గుపాటి స్వగ్రామం రాప్తాడు మండలం బండమీదపల్లిలో జరిగే కార్యక్రమాల గురించి కూడా ఇద్దరు నేతల మధ్య ప్రస్తావనకు వచ్చింది. ఈ భేటి అనంతరం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ మాట్లాడుతూ, రాప్తాడు, అనంతపురం నియోజకవర్గాలు కలిసి ఉన్నాయని.. ఈ ప్రాంతాల్లో చేపట్టాల్సిన వాటి గురించి చర్చించుకున్నట్టు వివరించారు.