Monday, September 15, 2025

Creating liberating content

తాజా వార్తలుప్రజలకు మంచి చేయడమే ఈ ప్రభుత్వ లక్ష్యం

ప్రజలకు మంచి చేయడమే ఈ ప్రభుత్వ లక్ష్యం

ఎన్డీఏ కూటమిలో ఇది మంచి ప్రభుత్వ కార్యక్రమం

పోలవరం శాసనసభ్యులు బాలరాజు

జీలుగుమిల్లి :ప్రజలకు మంచి చేయడమే ప్రభుత్వ ఏకైక లక్ష్యమని పోలవరం శాసనసభ్యులు బాలరాజు అన్నారు. జీలుగుమిల్లి మండలం పి.రాజవరం గ్రామ సభలో ఇది మంచి ప్రభుత్వం ! అనే కార్యక్రమాన్ని నేడు పోలవరం శాసనసభ్యులు లేవనెత్తిన చిర్రి బాలరాజు , పోలవరం తెలుగుదేశం కన్వీనర్ బోరగం శ్రీనివాస్ ప్రారంభించారు.
ఇది మంచి ప్రభుత్వం! ఎందుకంటే సంక్షోభంలోనూ సంక్షేమం అందించి, అభివృద్ధికి రెక్కల తొడిగిమొదటి వంద రోజుల్లోనే ఇది మంచి ప్రభుత్వం అనే ప్రజల చేత అనిపించుకుంటుంది కూటమి ప్రభుత్వం అన్నారు.
ఈ వంద రోజుల్లో ప్రజలు ఇచ్చిన కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు ప్రజలకు తెలియజేయడం ప్రధాన ఉద్దేశం.ఈ కార్యక్రమంలో పి రాజవరం పంచాయతీ సంబంధించిన ప్రజల నుండి వెనతులు పోలవరం శాసనసభ్యులు బాలరాజు స్వీకరించారు . వీరి సమస్యకు పరిష్కారం ఇస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో కూటమి మండల అధ్యక్షులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article