హుటాహుటిన ఆసుపత్రికి చేరుకున్న ఎమ్మెల్యే..క్షతగాత్రులకు పరామర్శ
బుధవారం సాయంత్రం భాకరాపేట ఘాట్ వద్ద ధాన్యం లారీ బోల్తా ఘటన లో వరదయ్యపాలెం మండలం కళత్తూరుకు చెందిన నవీన్ (28)మృతి చెందగా, అదే గ్రామానికి చెందిన మరో ఆరు మంది కూలీలు తీవ్ర గాయాలై తిరుపతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.సమాచారం అందుకున్న ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం గురువారం ఉదయం హుటాహుటిన ఆసుపత్రికి చేరుకున్నారు. డిఎం&హెచ్ఓ శ్రీహరి తో కలిసి ఆసుపత్రిలో గాయపడిన మల్లిఖార్జునయ్య, శేఖర్, మణిభూషణ్, వెంకటేష్, మణి, బాలయ్య లను పరామర్శించారు.ఇందులో మల్లిఖార్జునయ్య పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం అందించాలని ఎమ్మెల్యే రుయా వైద్యాధికారులు సూచించారు.
నవీన్ మరణం నన్ను కలచివేసింది: ఎమ్మెల్యే
కాగా ప్రమాదంలో మృతి చెందిన నవీన్ మరణం తనను తీవ్రంగా కలిసిందని ఎమ్మెల్యే ఆదిమూలం ఆవేదన వ్యక్తం చేశారు. మృతుని కుటుంబాన్ని ప్రభుత్వం అన్నీ విధాలుగా ఆదుకునేలా చర్యలు తీసుకుంటామని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందిస్తామని భరోసా కల్పించారు.

