ఎమ్ఎల్ఏ జెసి అష్మిత్ రెడ్డి
తాడిపత్రి: గ్రామాలలో సమస్యలను అధికారులు వెంటనే పరిష్కరించాలని శాసనసభ్యులు జెసి అష్మిత్ రెడ్డి ఆదేశించారు.
తాడిపత్రి మండలంలోని బోడాయిపల్లి, వెలమకూరు, ఆలూరు గ్రామాలలో శుక్రవారం తాడిపత్రి శాసనసభ్యులు జెసి అష్మిత్ రెడ్డి గ్రామ సభలు నిర్వహించారు. ప్రజల సమస్యలు తెలుసుకుని సత్వరమే పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు, పోలీసు అధికారులు, సచివాలయ ఉద్యోగులు, వైద్య సిబ్బంది, పారిశుధ్య కార్మికులు, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.