రాయలసీమలోనే అతిపెద్ద సభగా సిద్ధం సభ
సిద్ధం సభా ప్రాంగణాన్ని పరిశీలించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ,ఎమ్మెల్యేలు
రాప్తాడు;
రాయలసీమలోనే అతి పెద్ద సభగా సిద్ధం సభ నిర్వహిస్తున్నామని సిద్ధం సభకు ఏర్పాట్లు అన్ని పూర్తి అయ్యాయని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ సభ ద్వారా రాష్ట్ర ప్రజలకు సందేశాన్ని ఇస్తారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు శుక్రవారం ఆదివారం రోజున జరిగే సిద్ధం సభ జరిగే ఏర్పాట్లను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎమ్మెల్యేలు పరిశీలించారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వలు ఎన్ని సంవత్సరాలు రాష్ట్రాన్ని పరిపాలించిన ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఐదు సంవత్సరాలలో రాష్ట్రానికి ఎన్నో సంక్షేమ పథకాలు అందించి అభివృద్ధి పథంలో నడిపించారని వచ్చే ఎన్నికల్లో కూడా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అఖండ మెజారిటీతో గెలుస్తారని వ్యక్తం చేశారు.

ఈ సభకు రాష్ట్ర నలుమూలల నుండి వైకాపా నాయకులు కార్యకర్తలు హాజరవుతారని ఇప్పటికే ఇలాంటి సిద్ధం సభలు రెండు నిర్వహించామని , వాటికన్నా రాప్తాడు నిర్వహించే సిద్ధం సభ పెద్ద సభగా చెప్పుకోవాల్సి వస్తుందని పేర్కొన్నారు అనంతరం జిల్లా నాయకులు, ఎమ్మెల్యేలు సభకు జనాల సమీకరణ పై సమీక్ష నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి , అనంత వెంకటరామిరెడ్డి , కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి , జిల్లా పరిషత్ చైర్మన్ బోయ గిరిజమ్మ , జిల్లా ఉపాధ్యక్షులు పైల నరసింహయ్య ఉపాధ్యక్షులు వెంకటేష్ తదితర వైకాపా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు .