మార్కాపూర్ ఎంపీడీవో తోట చందన సర్పంచ్లు మరియు పంచాయతీ కార్యదర్శులకు 3 రోజుల రిఫ్రెషర్ శిక్షణను ప్రారంభించారు. సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులకు గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక, వీధి దీపాలు, పారిశుద్ధ్యం, వ్యర్థ పదార్థాల నిర్వహణ ప్రణాళికలపై శిక్షణ ఇవ్వనున్నారు. మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి కార్యక్రమం ప్రారంభించారు. అనంతరం చందన ఏపీ పంచాయితీ రాజ్ చట్టం 1994, రాజ్యాంగంలోని నిర్బంధ నిబంధనలు, పంచాయతీల్లో తప్పనిసరిగా 90 రోజుల్లో సాధారణ సభ నిర్వహించాలని, సొంత ఆదాయ వనరులు తదితర అంశాలను వివరించారు.
ఈఓపీఆర్డీ రామ్మోహన్రెడ్డి, సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులు, డిజిటల్ అసిస్టెంట్లు ఉత్సాహంగా శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు. శిక్షణ లో భాగంగా రేపుSWPC షెడ్ ఫీల్డ్ విజిట్ నిర్వహించబడుతుంది.


