మార్కాపురం పెద్దారవీడు: దోర్నాల ప్రాజెక్టు పరిధిలోని మండలంలోని సుంకేసుల గ్రామంలోని 4 అంగన్వాడి కేంద్రలలో తల్లిపాల వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సిహెచ్ఓ శ్రావణి మాట్లాడుతూ తల్లిపాలు బిడ్డలకు దివ్య ఔషధంతో సమానమని తల్లిపాలు యొక్క ప్రాముఖ్యతను వివరించారు. ఎఫ్ ఎల్ ఎం జిల్లా కోఆర్డినేటర్ ఎం.సుబ్బారావు మాట్లాడుతూ విద్యా విధానంలో నూతనంగా వచ్చిన మార్పులు పూర్వ ప్రాథమిక విద్య యొక్క ఆవశ్యతాను, అంగన్వాడి కేంద్రంలో ఎటువంటి కృత్యాల ద్వారా విద్యను అందిస్తున్నారో వివరించి, సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మహిళ కార్యదర్శి టి.మౌనిక, ఎంఎల్ హెచ్ పి శ్రావణి,అంగన్వాడి.కార్యకర్తలు,బి.భారతి,యు.నాగరత్నమ్మ,జి.స్రవంతి,జి.కొండమ్మ,జి.జయంతి,జె.రాజ్యలక్ష్మి,ఆశ వర్కర్లు,బాలింతలు, గర్భవతులు.తదితరులు.పాల్గొన్నారు.

