జిల్లా ప్రధాన కార్యదర్శి మనోహర్
కడప సిటీ:సిఐటియు జిల్లా శిక్షణ తరగతులు ఈ నెల 9, 10వ తేదీల్లో కడప నగరంలోని పాత బస్టాండ్సిఐటియుకార్యాలయంలోనిర్వహిస్తున్నట్లు జిల్లాప్రధాన కార్యదర్శిమనోహర్పేర్కొన్నారు. గురువారం సిఐటియు జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగాఆయనమాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగల,కార్మికుల పట్ల నిర్లక్ష్యం వహిస్తుందని విమర్శించారు. కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ కార్మికులను రెగ్యులర్ చేస్తామని ఇచ్చిన హామీ అమలు చేయడంలో విఫలమైందని పేర్కొన్నారు. ఎన్నికలతరుణంలోఉద్యోగులకు జరుగుతున్న అన్యాయాల పైన అసంఘటిత, సంఘటిత, కార్మికులు, స్కీం వర్కర్లకు జరుగుతున్న అన్యాయాల పైన, ప్రస్తుత రాజకీయాల పైన శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రెండు రోజులపాటు నిర్వహించే తరగతులకు సిఐటియు జిల్లా, వివిధ రంగాల నాయకత్వం పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులు రెడ్డి పాల్గొన్నారు.